Stock Market: స్టాక్ మార్కెట్ లో ఇలా పెట్టుబడి పెడితే రిస్క్ ఉండదు..

స్టాక్ మార్కెట్ అనగానే చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. షార్ట్ టైంలో డబ్బు బాగా సంపాదించడానికి ఇదో మంచి మార్గం అని అనుకుంటారు. మరికొందరు మాత్రం స్టాక్ మార్కెట్ అనగానే భయపడిపోతుంటారు.

Written By: Neelambaram, Updated On : November 23, 2023 3:14 pm
Follow us on

Stock Market: స్టాక్ మార్కెట్ అంటే కొందరికీ చాలా ఇష్టం. లక్కు తగిలిదే ఒక్కరోజులో కోటీశ్వరుడు అయిపోవచ్చు. అయితే లక్కు లేకున్నా తెలివిగా ఇన్వెస్ట్ మెంట్ చేసి చాలా మంది అత్యున్నత స్థాయికి ఎదిగారు. మరికొందరు మాత్రం ఉన్నదంతా ఊడ్చి అమ్ముకున్నారు. స్టాక్ మార్కెట్ లో కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా 100-వయసు అనే సూత్రాన్ని పాటించాలి. ఈ విధంగా పెట్టుబడులు పెడితే ఎలాంటి రిస్క్ ఉండదు. మరి ఆ సూత్రం గురించి తెలుసుకుందామా..

స్టాక్ మార్కెట్ అనగానే చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. షార్ట్ టైంలో డబ్బు బాగా సంపాదించడానికి ఇదో మంచి మార్గం అని అనుకుంటారు. మరికొందరు మాత్రం స్టాక్ మార్కెట్ అనగానే భయపడిపోతుంటారు. అయితే స్టాక్ మార్కెట్ లో కొన్ని ప్రణాళికల ద్వారా పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక ఆదాయం వస్తుంది. అలాగే పెట్టుబడులు నష్టపోయినా పెద్దగా ప్రభావం ఉండదు. అందుకోసం ఈ సూత్రాన్ని పాటించాలి.

వచ్చే జీతంలో 30 శాతం కొత్త పెట్టుబడులు పెట్టాలని ఇప్పటికే చాలా మంది ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ఉదాహరణకు లక్ష రూపాయల జీతం ఉంటే అందులో 30 శాతం అంటే 30 వేల రూపాయలను స్టాక్ మార్కెట్ లో పెట్టాలని కొందరు అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల భారీగా నష్టపోతారు. అంతేకాకుండా మిగతా అవసరాలకు డబ్బు అందుబాటులో ఉండదు. ఎలాంటి రిస్క్ ఉండకూడదంటే ఇలా చేయాలి.

వచ్చే జీతంలో 30 శాతం పెట్టుబడులు పెట్టాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ ఈ మొత్తాన్ని ఒకే కంపెనీపై ఇన్వెస్ట్ మెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ 100-వయసు అనే సూత్రాన్ని పాటించాలి. అంటే 100లో నుంచి వయసును తీసేయాలి. ఉదాహరణకు వయసు 30 ఏళ్లు ఉంటే.. 100-30 అంటే 70. 70 శాతం వరకు ఇన్వెస్ట్ మెంట్ చేయాలి. అంటే 30వేల రూపాయల నుంచి 23 వేల వరకు స్టార్ మార్కెట్లో పెట్టాలి. మిగతా డబ్బును పోస్టాఫీసు స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు వంటి వాటిపై ఇన్వెస్ట్ మెంట్ చేయలి.

30 శాతం మొత్తాన్ని స్టాక్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్ మెంట్ చేస్తే ఒకవేళ నష్టాలు వస్తే అప్పులు అవుతాయి. దీంతో సాధారణ జీవనం కష్టతరంగా మారుతుంది. అప్పుడు లాభాలు అటుంది.. నష్టాల పాలవుతారు. అయితే పెట్టుబడులు ఒకే కంపెనీపై కాకుండా వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్ మెంట్ చేయాలి. దీంతో ఒక కంపెనీ నుంచి లాభం రాకపోయినా.. మరో కంపెనీ నుంచి వస్తాయి. అందువల్ల స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి.