Hyundai
Hyundai: దేశీయ కార్ల ఉత్పత్తిలో హ్యుందాయ్ మిగతా వాటితో పోటీ పడుతోంది. ఇప్పటికే ఎన్నో మోడళ్లను అందించి వినియోగదారులను ఆకర్షించిన ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అమరుస్తూ.. టెక్నాలజీని అప్డేట్ చేస్తూ కొత్త కార్లను అందిస్తోంది. హ్యుందాయ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన Creta పాపులర్ మోడళ్లలో ఒకటిగా నిలిచింది. అయితే దీనిని ఇప్పుడు SUV వేరింట్ లో సరికొత్త విధంగా తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ కారులో లేటేస్ట్ ఫీచర్స్ తో పాటు ఆకట్టుకునే డిజైన్ చేశారు. దీని గురించి ఇప్పటికే ఆన్ లైన్ లో రావడంతో కారు ప్రియులు దీనిపై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. మరి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆటో మోబైల్ రంగంలో కొత్త Creta తో దూసుకుపోతామని హ్యుందాయ్ కంపెనీ సీఈవో తరుణ్ గార్గ్ తెలిపారు. ఈ సందర్భంగా కారు గురించి పూర్తి వివరాలు ప్రకటించారు. డార్క్ గ్రీన్ కలర్ లో ఉన్న కొత్త క్రెటాను చూసి మైండ్ బ్లోయింగ్ అని వినియోగదారులు కామెంట్లు పెడుతున్నారు. వీటితో పాటు 6 మోమోటోన్ కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఫియరీ రెడ్, రేంజ్ ఖాకీ, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైటన్ గ్రే, 1 డ్యూయల్ టోన్ కలర్ల తో ఆకర్షించనున్నాయి.
కొత్త Creta 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ తో పాటు మరో ఇంజిన్ కలిపి మొత్తం 3 ఇంజిన్లు ఉన్నాయి. ఇందులో 4 ట్రాన్స్ మిషన్లు, 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటాలో స్మార్ట్ సెన్స్, లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ ఆకర్షిస్తాయి. 70 ప్లస్ సేప్టీ ఫీచర్స్ 36 స్టాండర్స్ ఫీచర్స్ అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఫీచర్స్ విషయానికొస్తే ఎల్ ఈడీ లైట్లు, క్వాడ్ బీమ్ ఎల్ ఈడీ ల్యాంప్స్ , ఫ్రంట్ డిజైన్ ఆకర్షిస్తున్నాయి.
ఈరోజుల్లో ఎక్కువ మంది SUVలు కోరుకుంటున్న నేపథ్యంలో హ్యుందాయ్ సరికొత్త క్రెటాను అందుబాటులోకి తీసుకురావడం ఆసక్తిగా మారింది. అంతేకాకుండా లేటేస్ట్ టెక్నాలజీతో అందిస్తున్న దీనిని రూ.10.87 లక్షల ఎక్స్ షోరూం ధరతో విక్రయించనున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ యూవీల రేట్లు అత్యధికంగా ఉన్నాయి. కానీ హ్యుందాయ్ క్రెటాని మాత్రం తక్కువ ధరతోనే విక్రయిస్తున్నట్లు కంపెనీ సీఈవో తెలిపారు.