https://oktelugu.com/

Google Pay : గూగుల్‌ పే పెమెంట్‌ యాప్‌ నిలిపివేత.. జూన్‌ నుంచే అమలు

గూగుల్‌ పేను కంపెనీ 180 దేశాల్లో రీప్లేస్‌ చేస్తుందని సమాచారం. అన్ని దేశాల్లో ఆదరణ లేకపోవడం.. నిర్వహణ భారంతోనే గూగుల్ సంస్థ పేమెంట్స్ నుంచి వైదొలుగుతున్నట్టు సమాచారం. 

Written By:
  • NARESH
  • , Updated On : May 21, 2024 / 10:58 AM IST

    The suspension of Google Pay payment app has been implemented since June

    Follow us on

    Google Pay : ఆన్‌లైన్‌ పేమెంట్‌ యాప్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌ గూగుల్‌ పే. చాలాదేశాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే ఈ సర్వీస్‌ను జూన్‌ 4 తర్వాత నిలిపివేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ విషయాన్ని గూగుల్‌ సంస్థ గతంలోనే ప్రకటించింది.

    రెండు దేశాల్లో కొనసాగింపు..
    ప్రపంచంలోని అన్ని దేశాల్లో గూగుల్‌ పే సేవలు నిలిచిపోనున్నాయి. అయితే ఇదే సమయంలో ఇండియా, సింగపూర్‌లో ఈ సేవలు కొనసాగుతాయని సంస్థ ప్రతినిధి తెలిపారు. నిలిచిపోయిన దేశాల్లో కొత్త వాలెట్‌ గూగుల్‌ వాలెట్‌ అమలు చేస్తుంది. అమెరికాలో గూగుల్‌ పే కన్నా, గూగుల్‌ వాలెట్‌ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో భారతీయ యూజర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదు.

    జూన్‌ 4 వరకు వినియోగంలోనే..
    ఇదిలా ఉంటే 2024, జూన్‌ 4 వరకు ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌ పే సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గడువు తీరిన తర్వాత అమెరికన్‌ యూజర్లు అమౌంట్‌ సెండ్‌ చేసుకోవడానికి, రిసీవ్‌ చేసుకోవడానికి అవకాశం ఉందు. అమెరికాలోని గూగుల్‌ పే యూజర్లు గూగుల్‌ వాలెట్‌కి మారాలని సూచించింది. గూగుల్‌ పేను కంపెనీ 180 దేశాల్లో రీప్లేస్‌ చేస్తుందని సమాచారం. అన్ని దేశాల్లో ఆదరణ లేకపోవడం.. నిర్వహణ భారంతోనే గూగుల్ సంస్థ పేమెంట్స్ నుంచి వైదొలుగుతున్నట్టు సమాచారం.