https://oktelugu.com/

Stock market : స్టాక్ మార్కెట్ మరోసారి భారీ పతనాన్ని చవి చూసిన స్టాక్ మార్కెట్.. మధుపరుల సొమ్ము ఎంత ఆవిరైందంటే?

తాజాగా మార్కెట్ పతనానికి కారణాలను నిపుణులు ఈ విధంగా వివరించారు. ఫైనాన్షియల్ స్ర్టాటజిస్ట్ డాక్టర్ వీకే విజయ్ కుమార్ దీనికి కారణంగా యూఎస్ జాబ్ డేటాను ప్రస్తావించారు. ఇదే గ్లోబల్ సెల్ ఆఫ్ కు దారితీసినట్లు చెప్పారు. ఇదే నిఫ్టీ, సెన్సెక్స్ లలో భారీ పతనానికి కారణంగా కనిపిస్తున్నట్లు వివరించారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 5, 2024 / 02:56 PM IST
    Follow us on

    Stock market : స్టాక్ మార్కెట్ భారీ పతనం వైపు వెళ్తున్నది. ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ. 10 లక్షల కోట్లు ఆవిరి అయ్యింది. మార్కెట్ విలువ గత సెషన్ లో రూ. 457.16 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం రూ. 446.92 కోట్లకు పడిపోయింది. బెంచ్ మార్క్ సూచీలతో పాటు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం మార్కెట్ ప్రారంభం తర్వాత రెండో సెషన్ లో భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం ఇదే యూఎస్ ఆర్థిక వ్యవస్థలో సంభావ్య మాంద్యం తో సహా ప్రపంచ మార్కెట్ లో భయాలను సృష్టిస్తున్నది. సోమవారం ఉదయం 11.09 గంటల సమయంలో ఎస్అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్ 2125.73 పాయింట్లు క్షీణించి 78,856.23 వద్ద ఎన్ఎస్ఈ నిఫ్టీ 672 పాయింట్లు పతనమై 24,045.70 వద్ద ట్రేడింగ్ నడుస్తున్నది.చిన్న, మిడ్ క్యాప్ స్టాక్ లు గణనీయ క్షీణత వైపు నడుస్తుండడంతో మార్కెట్ తిరోగమనం పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ఇక ఈ సెషన్ లో పలు టాప్ మల్టీ బ్యాగర్ స్టాక్ లు భారీగా క్షీణించాయి. ప్రపంచ మార్కెట్ లో అనిశ్చితి కారణంగా అస్థిరత పెరిగింది. అన్ని ప్రధాన రంగాల సూచీలు రియల్టీ, ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల స్టాక్ లు పెద్ద ఎత్తున నష్టాలను చవిచూశాయి.

    మార్కెట్ పతనానికి కారణాలివే..
    తాజాగా మార్కెట్ పతనానికి కారణాలను నిపుణులు ఈ విధంగా వివరించారు. ఫైనాన్షియల్ స్ర్టాటజిస్ట్ డాక్టర్ వీకే విజయ్ కుమార్ దీనికి కారణంగా యూఎస్ జాబ్ డేటాను ప్రస్తావించారు. ఇదే గ్లోబల్ సెల్ ఆఫ్ కు దారితీసినట్లు చెప్పారు. ఇదే నిఫ్టీ, సెన్సెక్స్ లలో భారీ పతనానికి కారణంగా కనిపిస్తున్నట్లు వివరించారు. జూలైలో ఉద్యోగాల కల్పన తగ్గడం కారణంగా యూఎస్ నిరుద్యోగ రేటు 4.3 శాతం పెరిగినట్లు తెలిపారు. యూఎస్ ఆర్థిక వ్యవస్థకు సాఫ్ట్ ల్యాండింగ్ అంచనాలు ప్రస్తుతం ప్రమాదకరంగా మారినట్లు చెప్పారు. మరో వైపు మధ్యప్రాచ్యంలోని భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కూడా మార్కెట్ భయాలను తీవ్రంగా పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

    జపాన్ మార్కెట్లోనూ..
    యెన్ క్వారీ ట్రేడ్ ను నిలిపివేయడం జపనీస్ మార్కెట్ ను కుదిపేసింది. ఇది మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఉదయం నిక్కీ ఇండెక్స్ 4శాతానికి పైగా క్షీణించడం కూడా జపాన్ మార్కెట్ సంక్షోభాన్ని సూచిస్తున్నది. ఇండియాలో ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రక్షణ, రైల్వే వంటి అధిక విలువ కలిగిన రంగాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు విజయ్ కుమార్ భావించారు. ఈ సమయంలో ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు తొందరపడకుండా, మార్కెట్ స్థిరీకరణ కోసం వేచి చూడాలని ఆయన సూచించారు.

    మరో వైపు నిపుణులు సమీత్ చవాన్, తాన్వీకాంచన్ లాంటి వారు కూడా ఇదే అంశాన్ని నొక్కి చెప్పారు. యూఎస్ లో ఆర్థిక మందగమనం, జపనీస్ మార్కెట్ క్షీణత, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా స్టాక్స్ వడ్డీ రేట్లను కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. తాన్వీ కాంచన్ మాట్లాడుతూ ఈ అమ్మకం లాభాల బుకింగ్ ద్వారా స్వల్పకాలిక అస్థిరతను కలిగి ఉంటుంది. భారతీయ ఈక్విటీలలో ఏ విధమైన దీర్ఘకాలిక భయాందోళన మోడ్‌కు సూచిక కాదు.

    ఈక్విటీ మార్కెట్‌లోకి ప్రవేశించాలని చూస్తున్న పెట్టుబడిదారుల కోసం, అస్థిర కాలాల్లో అస్థిరమైన ప్రవేశంగా పరిగణించవచ్చని అన్నారు. ఇక సోమవారం ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ఇన్వెస్టర్లకు మార్కెట్ పతనం కావడంతో నిరాశే ఎదురైంది. మార్కెట్ సుమారు రూ. 10 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది.