https://oktelugu.com/

Global Market : టాప్ 20 బిలియనీర్ల సంపద ఆవిరి.. అదానీ, అంబానీలకు బిగ్ షాక్.. గ్లోబల్ మార్కెట్ పతనంతో అంతా ఒకే దారిలో..!

 గ్లోబల్ మార్కెట్లో కొనసాగుతున్న ఒడిదుడుకులతో బిలియనీర్లు షాక్ కు గురయ్యారు. వారికి చెందిన కంపెనీలు కోట్లాది రూపాయలను కోల్పోయాయి. దీంతో అయోమయంలో పడ్డారు. టాప్ లో ఉన్న వారు సైతం ఈ ఫలితాలను చూసి అవాక్కయ్యారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 5, 2024 / 03:10 PM IST
    Follow us on

    Global Market : ప్రపంచంలోని టాప్ 20 ధనవంతుల లెక్క మారుతోంది. వారి నికర విలువలో మార్పు వస్తున్నది. మార్కెట్ క్షీణత వారికి పెద్ద దెబ్బలా మారింది. దీంతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తీవ్రంగా నష్టపోయారు. ఇక ఎలాన్ మస్క్ నుంచి బిల్ గేట్స్ వరకు, గౌతమ్ అదానీ నుంచి ముఖేష్ అంబానీ వరకు అంతా నష్టపోయారు. వారి నికర విలువ భారీగా తగ్గింది. ఇందులో ముఖ్యంగా అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ భారీ నష్టాన్ని భరించాల్సి వచ్చింది. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం నికర విలువలో క్షీణత టాప్ 10 సంపన్నుల వరకే పరిమితం కాలేదు. ప్రపంచంలోని టాప్ 20 సంపన్నుల వరకు దీని ప్రభావం పడింది. టెస్లా, స్సేస్ ఎక్స్ వంటి కంపెనీల బాస్ ఎలోన్ మస్క్ సంపద 6.57 బిలియన్ డాలర్లు తగ్గి 235 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అతను ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగున్నాడు. ఇక అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ నికర విలువ 15.2 బిలియన్ డాలర్లు తగ్గి 191 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇక ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ సంపద 1.21 బిలియన్ డాలర్లు తగ్గి 182 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

    టాప్ 10 ధనవంతులకు తీవ్ర నష్టం
    ప్రపంచంలోని 10 మంది ధనవంతుల సంపదను పరిశీలిస్తే, ఫేస్‌బుక్‌ యజమాని మార్క్ జుకర్‌బర్గ్ 2.39 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూశారు. అతడి సంపద 174 బిలియన్ డాలర్లకు పడిపోయింది. బిల్ గేట్స్ నికర విలువ 1.95 బిలియన్ డాలర్లు తగ్గి 155 బిలియన్ డాలర్లు, లేరీ పేజ్ నికర విలువ 3.45 బిలియన్ డాలర్లు తగ్గి 150 బిలియన్ డాలర్లు, లేరీ ఎల్లిసన్ నికర విలువ 4.37 బిలియన్ డాలర్లు తగ్గి 148 బిలియన్ డాలర్లు చేరుకుంది. స్టీవ్ బాల్మెర్ సంపద 2.83 బిలియన్ డాలర్లు తగ్గి 142 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వీరే కాకుండా సెర్గీ బ్రిన్ నికర విలువ 3.24, వారెన్ బఫెట్ సంపద 1.31 బిలియన్ డాలర్లు తగ్గింది. అంటే ఈ క్షీణత వీరిద్దరి నికర విలువ వరుసగా తర్వాత, బిలియనీర్లిద్దరి నికర విలువ వరుసగా 141, 135 బిలియన్ డాలర్లకు తగ్గింది.

    అదానీ, అంబానీలకు షాక్
    ఇక టాప్ 20లో ఉన్న అదానీ, అంబానీలకు షాక్ తప్పలేదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో 11వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముఖేష్ అంబానీ కూడా తీవ్రంగా నష్టపోయారు. ఆయన సంపద 1.20 బిలియన్ డాలర్లు తగ్గి, 113 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక ఆయన తర్వాతి స్థానంలో కొనసాగుతున్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నికర విలువ 1.34 బిలియన్ డాలర్లు తగ్గి 110 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ జాబితాలో ఉన్న ఇతర బిలియనీర్లు కూడా భారీ నష్టాలను చవిచూశారు. మైఖేల్ డెల్ యొక్క సంపద 3.22 బిలియన్ డాలర్లకు తగ్గి, ప్రస్తుతం 97.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

    అమాన్సియో ఒర్టెగా 1.07 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూడగా, అతడి సంపద 95.1 బిలియన్ డాలర్లకు తగ్గింది. జెన్సన్ హువాంగ్ నికర విలువ 1.67 బిలియన్ డాలర్లు తగ్గి, 94.3 బిలియన్ డాలర్లకు, జిమ్ వాల్టన్ నికర విలువ 1.68 బిలియన్ డాలర్లు తగ్గి 90.5 బిలియన్ డాలర్లకు, రాబ్ వాల్డన్ సంపద 1.60 డాలర్లు తగ్గి 88.5 బిలియన్ డాలర్లకు, ఎలీస్ వాల్టన్ సంపద 1.59 బిలియన్ డాలర్లు తగ్గి 87.7 బిలియన్ డాలర్లకు, కార్లోస్ స్లిమ్ 1.20 బిలియన్ డాలర్లు తగ్గి, 87.3 బిలియన్ డాలర్లకు, ఫ్రాంకోయిస్ బెటన్కోర్ట్ 517 మిలియన్ డాలర్లు తగ్గి 85.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నారు.