Reserve Bank Of India: సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం హైదరాబాదులోని కోకాపేట లోని నియో పోలీస్ ప్రాంతంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి చేసిన వెంచర్ లో భూములను వేలం వేశారు. ఎకరం 100 కోట్లకు విక్రయమైంది. రాజ్ పుష్ప అనే సంస్థ ఆ ఎకరం భూమిని కొనుగోలు చేసింది. అప్పట్లో దానిని సంచలనంగా పేర్కొన్నారు. గులాబీ మీడియా అయితే మహా గొప్పగా రాసింది. చూశారా మా సార్ పరిపాలనలో హైదరాబాద్ ఏ రేంజ్ లో డెవలప్ అయిందో అన్నట్టుగా డబ్బాలు కొట్టింది. కానీ అందులో ఉన్న డొల్ల ఎలాంటిదో తర్వాత గాని అర్థం కాలేదు.
Also Read: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండుల్కర్.. క్లారిటీ
కోకాపేట విషయాన్ని కాస్త పక్కన పెడితే ముంబైలో ఎకరం ధర 800 కోట్ల వరకు వెళ్లింది. ఇంత ధర వెచ్చించి కొనుగోలు చేసింది రిలయన్స్ ముఖేష్ అంబానీ, టాటా లో, బిర్లాలో కాదు. అంత ధర పెట్టి కొనుగోలు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నిజానికి మనదేశంలో అత్యంత ఖరీదైన ప్రాంతాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భవనాలు ఉన్నాయి. అంతకుమించి స్థలాలు కూడా ఉన్నాయి. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలోని నారీమన్ పాయింట్ లో ఉన్న ప్లాట్ కోసం ఏకంగా 34 72 కోట్లు చెల్లించింది. ఈ లెక్కన ఎకరానికి 800 కోట్ల దాకా అయింది. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్థలాన్ని కొనుగోలు చేసింది. స్టాంప్ డ్యూటీ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 208 కోట్లు చెల్లించింది. ఇక ఈ ఏడాది మనదేశంలో ఇదే అతిపెద్ద భూ క్రయమని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ స్థలం పక్కనే ముంబై హైకోర్టు.. ఇతర కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి.
దేశంలో వివిధ ప్రాంతాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భవనాలు ఉన్నప్పటికీ.. మారుతున్న అవసరాల ఆధారంగా అతిపెద్ద కార్యాలయాన్ని నిర్మించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తున్నది.. ఇందులో భాగంగానే దేశ ఆర్థిక రాజధానిలో అతి పెద్ద భవనాన్ని నిర్మించనుంది. ఈ ప్రాంతంలో ఎప్పటినుంచి భవన నిర్మాణ పనులు మొదలు పెడుతుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పలేదు. కాకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలో అతిపెద్ద, అత్యంత విలువైన భూమి క్రయం ఇదేనని తెలుస్తోంది.. అయితే ఈ స్థాయిలో నగదు వెచ్చించి భూమిని కొనుగోలు చేయడం వెనక కారణం ఏంటనేది మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు చెప్పడం లేదు.