Oppo Reno 15 Pro Price: Oppo కంపెనీకి చెందిన చాలా ఫోన్లు ఇప్పటికే చాలామందిని ఆకర్షించాయి. కొంతమంది ఈ కంపెనీకి చెందిన మొబైల్స్ మార్కెట్లోకి వస్తున్నాయంటే ప్రత్యేకంగా కొనుగోలు చేయడానికి రెడీ అవుతారు. ఇందులో భాగంగా ఒప్పో లేటెస్ట్ గా Reno 15 ప్రో మాక్స్ లాంచ్ చేసింది. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త ఫోన్ కొనుగోలు కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఈ ఫోన్ మంచి గిఫ్ట్ అని అంటున్నారు. ఎందుకంటే ఇందులో బలమైన బ్యాటరీ తో పాటు అద్భుతమైన ఫోటోగ్రఫీ అందించే కెమెరాలు సెట్ చేశారు. అసలు ఈ మొబైల్ ఎలా ఉందో..? దీని ధర ఎంతో..? ఇప్పుడు చూద్దాం..
Oppo కంపెనీ ఇటీవల తైవాన్ లో Reno 15 ప్రో మాక్స్, Reno 15 నో రిలీజ్ చేసింది.Reno 15 మొబైల్ డిస్ప్లే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో 120 Hz రిప్లేస్ రేట్ అందించే AMOLED డిస్ప్లేను అమర్చారు. ఇది ఫోటోగ్రఫీ తో పాటు నాణ్యమైన వీడియోలు తీయడానికి అనుగుణంగా ఉంటుంది. రెండు మొబైల్స్ లోనూ మీడియా టెక్ డైమండ్ సిటీ 8450 చీప్ సెట్ హుడ్ ను సెట్ చేశారు. అలాగే ఈ మొబైల్ 7 జన్ 4 ప్రాసెసర్ కింద పనిచేస్తుంది. దీంతో మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి ఇది బెస్ట్ ఫోన్ అని అంటున్నారు. ఒప్పో రెనో ప్రో మాక్స్ డిస్ప్లే 6.780 అంగుళాల వరకు ఉంటుంది.
ఒప్పో రెనో రెండు మొబైల్స్ లోనూ 12 జిబి రామ్ ఉండడంతో మూవింగ్ ఫాస్ట్ గా ఉంటుంది. గేమింగ్ కోరుకునే వారితోపాటు రకరకాల యాప్స్ ఉపయోగించే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇందులో512 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండడంతో కావలసిన ఫైల్స్ ను స్టోర్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. రెండు మొబైల్స్ లోనూ ప్రధానంగా 200 MP కెమెరాలు అమర్చారు. అలాగే 50 MP అల్ట్రా వైట్ కెమెరా ఉండగానే ఉంది. మరో 50 MP సెల్ఫీ ఫోటోలను తీసుకోవచ్చు.
ఈ మొబైల్ బ్యాటరీ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 6,500 mAh బ్యాటరీని అమర్చారు. ఇది 80 W వైరుడు చార్జింగ్, 50 W వైర్లెస్ ఛార్జింగ్తో సపోర్ట్ ఇవ్వనుంది. దీంతో రోజంతా వినియోగించినా.. డౌన్ టైం తక్కువగా ఉంటుంది. ఫలితంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, ఎక్కువగా మొబైల్ యూజ్ చేసే వారికి ఇది సపోర్ట్ చేయనుంది. ఒప్పో రెనో 15 ధర రూ.17,990 తో విక్రయించనున్నారు. ఒప్పో రెనో ప్రో మాక్స్ 19,990 గా ఉంది. ఆధునిక టెక్నాలజీతో కూడిన మొబైల్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు.