https://oktelugu.com/

Cheapest Electric Scooters: రూ.50వేల లోపు స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే వీటి గురించి తెలుసుకోండి..

ఆటోమోబైల్ రంగంలో మార్పులతో స్కూటర్ల మోడళ్లు మారిపోయాయి. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ స్కూటర్లదే హవా నడుస్తోంది. అయితే ఇవి ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి రావడంతో ధరలు కాస్త గట్టిగానే ఉన్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : May 10, 2023 10:59 am
    Cheapest Electric Scooters

    Cheapest Electric Scooters

    Follow us on

    Cheapest Electric Scooters: ఈరోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. భర్త ఉద్యోగానికి వెళ్తే భార్యలు ఇంట్లో పనులు చూసుకోవడంతో పాటు ఆయనకు ఆర్థిక సపోర్టుగా ఉంటున్నారు. అయితే కొన్ని సమయాల్లో బయటికి వెళ్లాల్సినప్పుడు వీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆటో లేదా క్యాబ్ ను ఏర్పాటు చేసుకుంటే ఖర్చులు మోపెడవుతున్నాయి. దీంతో కొందరు స్కూటీలు కొనుగోలుపై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. కొన్ని రోజుల పాటు డ్రైవింగ్ నేర్చుకొని సొంత వెహికిల్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాలం మారుతున్న కొద్దీ స్కూటర్ల మోడళ్లు కూడా మారాయి. కేవలం మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా ఉపయోగించేలా కంపెనీలు స్కూటర్లను డిజైన్ చేశాయి. ముఖ్యంగా సిటీల్లో ఉండేవారు ఎక్కడికి వెళ్లాలనుకున్నా ఉపయోగపడే విధంగా వీటిని తయారు చేస్తున్నారు.

    ఆటోమోబైల్ రంగంలో మార్పులతో స్కూటర్ల మోడళ్లు మారిపోయాయి. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ స్కూటర్లదే హవా నడుస్తోంది. అయితే ఇవి ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి రావడంతో ధరలు కాస్త గట్టిగానే ఉన్నాయి. కానీ వినియోగదారులను ఆకర్షించడానికి ఫ్యూజియామా కంపెనీ రూ. 50 వేల లోపు అందించడానికి కొన్ని మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ఫీచర్స్ ఆకట్టుకోవడంతో పాటు ధరలు తక్కువగా ఉండడంతో వినియోగారులు వీటిపై మనసు పారేసుకుుంటున్నారు. మరి ఈ స్కూటర్ల ఫీచర్స్, ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    ఫ్యూజియామా స్పెక్ట్రా:
    కంపెనీ ప్రకారం ఒక్కసారిగా దీనిని పూర్తిగా చార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. పూర్తి చార్జింగ్ కావడానిక 5 గంటలు పడుతుంది. 250 వాట్స్BLDC మోటార్, 1.56 kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. టాప్ స్పీడ్ 25 కిలోమీటర్లు.

    స్పెక్ట్రా ఫ్రో:
    250 వాట్స్ మోటార్, 1.35kWh బ్యాటరీని కలిగి ఉన్నా స్పెక్ట్రా కూడా ఒక్కసారి చార్జింగ్ చేస్తే 90 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. కలర్డ్ డిజిటల్ మీటర్, డిటాచబుల్ బ్యాటరీ, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, మొబైల్ చార్జింగ్ కోసం యూఎస్ బీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని స్పీడ్ 25 కిలోమీటర్లు.

    థండర్:
    థండర్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 90 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. 1.35kWh బ్యాటరీని కలిగి ఉంది. 5 గంటలు చార్జీంగ్ పూర్తయిన తరువాత 90 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. డిటాచబుల్ బ్యాటరీ, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అచ్చం స్పెక్ట్రీ ఫీచర్స్ నే కలిగి ఉంటాయి. వీటితో పాటు మరో మోడాల్ వెస్పర్. పై మోడళ్లలో ఉన్న ఫీచర్లే ఇందులో ఉంటాయి.

    ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగంతో కొన్ని మోడళ్ల ధరలు లక్షల్లో ఉన్నాయి. కానీ సామాన్యులకు సైతం అందుబాటులో తెచ్చే విధంగా వీటిని తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫ్యూజియామా కంపెనీ నుంచి విడుదలైన పై మోడళ్లన్నీ రూ.49,499 నుంచి ప్రారంభమవుతున్నాయి. అాదనపు ఫీచర్లు ఇతర సౌకర్యాలు కావాలందే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.