https://oktelugu.com/

Elon Musk: ప్రపంచ కుబేరుడు మస్క్‌.. మళ్లీ నంబర్‌ వన్‌ స్థానం!

చాలాకాలం నుంచి ఈ ముగ్గురి మధ్యనే పోటీ నెలకొంది. తాజాగా టెస్లా షేర్లు రాణించడంలో మస్క్‌ సంపద అమాంతం పెరిగింది. దీంతో తిరిగి మొదటి స్థానం దక్కించుకున్నాడు. దీంతో ఆయన జెఫ్‌ బెజోప్‌ను వెనక్కు నెట్టి తిరిగి మొదటి స్థానం దక్కించుకున్నాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 20, 2024 / 10:48 AM IST

    Elon Musk

    Follow us on

    Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నారు. బ్లూమ్‌బర్గ బిలియనీర్‌ ఇండెక్స్‌ తాజా నివేదిక ప్రకారం.. 208 బిలియన్ డాలర్ల నికర నిల్వలతో బెజోస్‌ను వెనక్కి నెట్టి.. మొదటి స్థానం దక్కించుకున్నాడు. 205 బిలియన్‌ డాలర్లతో జెఫ్‌ బెపోస్‌ 199 బిలియన్‌ డాలర్లతో బెర్నాడ్‌ బెజోస్‌ ప్రస్తుతం మొదటి స్థానం కోల్పోయాడు. దీంతో 208 బిలియన్‌ డాలర్ల నికర విలువలతో బెజోస్‌ను వెనక్కి నెట్టి మస్క్‌ మొదటి స్థానం చేరుకున్నారు.

    ముగ్గురి మధ్యే పోటీ..
    చాలాకాలం నుంచి ఈ ముగ్గురి మధ్యనే పోటీ నెలకొంది. తాజాగా టెస్లా షేర్లు రాణించడంలో మస్క్‌ సంపద అమాంతం పెరిగింది. దీంతో తిరిగి మొదటి స్థానం దక్కించుకున్నాడు. దీంతో ఆయన జెఫ్‌ బెజోప్‌ను వెనక్కు నెట్టి తిరిగి మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఇటీవల జరిగిన టెస్లా సాధారణ సమావేశంలో మస్క్‌కు 56 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీ ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు అంగీకరించారు. దీంతో ఆయన కంపెనీ షేర్లు భారీగా లాభపడ్డాయి.

    ఆసియా ధనవంతుడిగా ముఖేశ్‌
    బ్లూమ్‌బెర్గ్‌ ఇండెక్స్‌ ప్రకారం.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీని వెనక్కు నెట్టి ముఖేశ్‌ మొదటి స్థానానికి చేరుకున్నారు. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ముఖేశ్‌ అంబానీ 113 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో 12వ స్థానంలో ఉన్నారు. గౌతం అదానీ 108 బిలియన్‌ డాలర్ల సంపదతో 14వ స్థానంలో కొనసాగుతున్నారు. గతంలో 12వ స్థానంలో ఉన్న ముఖేశ్‌ అంబానీ ఇప్పుడు 13వ స్థానానికి దిగజారారు, గతంలో 11వ స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు 14వ స్థానానికి పడిపోయారు.