Railway Recruitment: రైలే ఉద్యోగార్థులకు శుభవార్త..

తాజా పోస్టుల సంఖ్య 18,799కి చేరింది. ఇందులో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పోస్టుల సంఖ్య 585 నుంచి 1,949కి పెరిగింది. సౌత్‌–ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే పోస్టుల సంఖ్య 1,192 నుంచి 3,973 కి పెరిగింది.

Written By: Raj Shekar, Updated On : June 20, 2024 10:54 am

Railway Recruitment

Follow us on

Railway Recruitment: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రైల్వే. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఉన్న 5,696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే ఆ పోస్టుల సంఖ్య మూడింతలు పెంచుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పోస్టుల సంఖ్య ఏకంగా 18,700 చేరింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో ప్రాధామ్యాల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ పేర్కొంది.

వయో పరిమితి పెంపు..
ఇదిలా ఉంటే అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగార్థుల అర్హత వయసును కూడా ఆర్‌ఆర్‌బీ పెంచింది. గతంలో 30 ఏళ్లు ఉండగా, దానిని 33 ఏళ్లకు పెంచింది. ఇక నియామక పరీక్ష రెండు దశల కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(స్టేజ్‌–1, స్టేజ్‌–2), కంప్యూటర్‌ ఆధారిత ఆప్టిట్యూడ్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.

జోన్ల వారీగా పెరిగిన పోస్టులు ఇలా..
ఇక తాజా పోస్టుల సంఖ్య 18,799కి చేరింది. ఇందులో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పోస్టుల సంఖ్య 585 నుంచి 1,949కి పెరిగింది. సౌత్‌–ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే పోస్టుల సంఖ్య 1,192 నుంచి 3,973 కి పెరిగింది. ఇక సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే పోస్టుల సంఖ్య 300 నుంచి 1,001కి పెరిగింది. సదరన్‌ రైల్వే పోస్టుల సంఖ్య 218 నుంచి 726కి పెరిగింది. సౌత్‌ వెస్టర్న్‌ రైల్వే పోస్టుల సంఖ్య 473 నుంచి 1,576కి పెరిగింది. సెంట్రల్‌ రైల్వే పోస్టులు 535 నుంచి 1,786, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే 479 నుంచి 1,595, ఈస్టర్న్‌ రైల్వే 415 నుంచి 1,382, నార్త్‌ సెంట్రల్‌ రైల్వే 241 నుంచి 802, నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వే 43 నుంచి 143, నార్త్‌–ఈస్ట్‌ ఫ్రంటియర్‌ రైల్వే 129 నుంచి 428, నార్తర్న్‌ రైల్వే 150 నుంచి 499, నార్త్‌ వెస్టర్న్‌ రైల్వే 228 నుంచి 761, సదరన్‌ రైల్వే 218 నుంచి 726 సౌత్‌ వెస్టర్న్‌ రైల్వే 473 నుంచి 1,576, వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే 219 నుంచి 729, వెస్ట్రర్న్‌ రైల్వే పోస్టులు 413 నుంచి 1,376కి పెరిగాయి.