https://oktelugu.com/

TCS : ఇక ఆఫీసులకు రావాల్సిందే.. టీసీఎస్ హుకూం.. కారణం ఏంటంటే?

కానీ ఇప్పుడు వారికి తప్పేలా కనిపించడం లేదు. ఇక వర్క్ ఫ్రం హోం ఉండబోదని ప్రతీ ఎంప్లాయ్ ఖచ్చితంగా ఆఫీసులకు రావాల్సిందేనని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని టాటా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ఆర్ఓ) మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు 18 నెలలుగా చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయని ఆయన తెలిపారు

Written By:
  • NARESH
  • , Updated On : July 15, 2024 / 04:04 PM IST
    Follow us on

    TCS : వర్క్ ఫ్రం హోం.. ఇలా పని చేయడం ఉద్యోగులకు ఎంత హాయిగా ఉంటుందో కదా.. అవును ఎందుకంటే బాస్ వేధింపులు ఉండవు, తోటి ఉద్యోగులతో కలిసి పబ్ లు, షికార్లు ఉండవు, ఆఫీసులకు రాను, పోను ఖర్చు కూడా ఉండదు. కొవిడ్ కు ముందు వర్క్ ఫ్రం హోం అనే మాటే వినిపించలేదు. ఏదో చిన్న పాటి, అసలు గుర్తింపు లేని సంస్థలు వేలల్లో జీతాలు ఇచ్చి వర్క్ ఫ్రం హోం చేయించుకునేవి. కానీ అది పెద్దగా బయటకు తెలియకపోయేవి. కానీ కొవిడ్ పుణ్యామా ప్రతీ ప్రైవేట్ ఆఫీస్ వర్క్ ఫ్రం హోం చేయించుకోక తప్పలేదు.

    కొవిడ్ వినాశనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు వేవ్స్ లో వ్యాపించిన ఈ వ్యాధి ప్రపంచ వినాశనాన్ని చవి చూస్తుందని అందరూ అనుకున్నారు. అంతలా ప్రాణాలను బలికొంది. ఫస్ట్ వేవ్ చాలా ఇబ్బందులు తెచ్చిపెడితే.. సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ ను మించి ప్రాణాలు తీసుకుంది. ఇక థర్డ్, ఫొర్త్ వేవ్ వరకు అందరూ వాక్సినేషన్ చేయించుకోవడం వల్ల కొంత వరకు ప్రభావం చూపలేదు.

    కొవిడ్ కు మెడిసిన్ లేకపోవడంతో ఫస్ట్ వేవ్ నుంచే కంపెనీలు వర్క్ ఫ్రం హోంను డిక్లేర్ చేశాయి. దీంతో ఎంప్లాయీస్ ఇంటి నుంచి పని చేయడం మొదలు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆఫీస్ మెయింటెనెన్స్ కూడా లేకపోవడంతో కంపెనీలపై ఆర్థిక భారం కూడా తగ్గింది. 2019 నుంచి వర్క్ ఫ్రం హోం మొదలైంది. అంటే ఆరేళ్లు కొనసాగుతూనే ఉంది. థర్డ్ వేవ్ ముగిసిన తర్వాత కంపెనీలు ఎంప్లాయీస్ ను ఆఫీస్ కు రావాలని కాల్ చేసింది. కానీ ఉద్యోగానికి రిజైన్ చేస్తాం కానీ ఆఫీసుకు రామని ఉద్యోగం కంటు ప్రాణాలే ముఖ్యమని ఎంప్లాయీస్ తేల్చి చెప్పారు. దీంతో కంపెనీలు వెనక్కి తగ్గాయి.

    ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం లేదని డబ్ల్యూహెచ్ఓ చెప్పడంతో ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేశాయి. కానీ అప్పటికే ఇంటికి అలవాటు పడ్డ ఉద్యోగులు మొరాయించారు. ఇక సాఫ్ట్ వేర్ కంపెనీలపై ఆధారపడిన ఫుడ్ కోర్టులు, క్యాబ్ లు, ఇంకా చిన్న చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతుండడంతో ప్రభుత్వం కల్పించుకోవాల్సి వచ్చింది. మొదలు షిఫ్టుల వారీగా ఎంప్లాయీస్ ను కార్యాలయాలకు రప్పించాలని కాంపెనీలను కోరాయి. ఆ సమయంలో కూడా వారు రామని మొండి కేశారు.

    కానీ ఇప్పుడు వారికి తప్పేలా కనిపించడం లేదు. ఇక వర్క్ ఫ్రం హోం ఉండబోదని ప్రతీ ఎంప్లాయ్ ఖచ్చితంగా ఆఫీసులకు రావాల్సిందేనని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని టాటా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ఆర్ఓ) మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు 18 నెలలుగా చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయని ఆయన తెలిపారు. దీనిలో భాగంగా వారంలో 5 రోజులపాటు ఆఫీసు నుంచి పనిచేసే ఉద్యోగుల సంఖ్య 70 శాతం పైగా పెరిగిందని, కాగా మిగతా దిగ్గజ కంపెనీలు కూడా సిబ్బందిని కార్యాలయాలకు రప్పిస్తున్నాయని ఆయన తెలిపారు.

    ఈ నిర్ణయం కేవలం కంపెనీలకే కాకుండా కంపెనీలపై ఆధారపడిన చిన్న చిన్న వ్యాపారులకు కూడా మేలు చేస్తుందని చిరు వ్యాపారులు చెప్తున్నారు. టీసీఎస్ నిర్ణయంపై ఫాస్ట్ ఫుడ్, ఫుడ్ పాత్ ఫుడ్, రెస్టారెంట్లు, చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.