https://oktelugu.com/

Rakshit Shetty: పాటలు కాపీ కొట్టారని నటుడు, నిర్మాతపై మ్యూజిక్ సంస్థ ఫిర్యాదు.. కేసు నమోదు.. పోలీసుల దర్యాప్తు..

Rakshit Shetty: కన్నడ హీరో రక్షిత్ శెట్టి 1093 జూన్ 6న జన్మించారు. ఎలక్ట్రానిక్స్,కమ్యూనికేషన్స్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన రెండు సంవత్సరాల పాటు సాప్ట్ వేర్ జాబ్ చేశాడు. ఆ తరువాత షార్ట్ ఫిల్మ్ లు చేస్తూ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 15, 2024 4:29 pm
    FIR filed against Kannada film star Rakshit Shetty

    FIR filed against Kannada film star Rakshit Shetty

    Follow us on

    Rakshit Shetty: కన్నడ స్టార్ నటుడు రక్షిత్ శెట్టిపై కేసు నమోదైంది. కొన్ని పాటలను తమ సంస్థ నుంచి కాపీ కొట్టారని MRT అనే మ్యూజిక్ కంపెనీ రక్షిత్ శెట్టిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హీరోపై కేసు నమోదైంది. ఈ పాటలను రక్షిత్ శెట్టి ‘బ్యాచిలర్ పార్టీ’ సినిమాలో వాడుకున్నారని ఎంటీఆర్ సంస్థ ఫిర్యాదులో పేర్కొంది. వాస్తవానికి ఈ పాటలు తమ సంస్థ ‘న్యాయ ఎల్లిదే’, ‘గాలిమాతు’ అనే సినిమాలకు అందించించి. కానీ వీటిలోని పాటలను రక్షిత్ శెట్టి కాపీ కొట్టారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా రక్షిత్ శెట్టికి నోటీసులు పంపించారు.

    కన్నడ హీరో రక్షిత్ శెట్టి 1093 జూన్ 6న జన్మించారు. ఎలక్ట్రానిక్స్,కమ్యూనికేషన్స్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన రెండు సంవత్సరాల పాటు సాప్ట్ వేర్ జాబ్ చేశాడు. ఆ తరువాత షార్ట్ ఫిల్మ్ లు చేస్తూ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టారు. అయితే ఆ తరువాత అరవింద్ కౌశిక్ డైరెక్షన్లో 2010లో వచ్చిన ‘నామ్ ఏరియల్ ఒండ్ దిన’ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ‘సింపుల్ అగి ఓంద్ లవ్ స్టోరీ’తో సక్సెస్ అయ్యారు.

    లేటేస్ట్ గా రక్షిత్ శెట్టి ‘బ్యాచిలర్ పార్టీ’ సినిమా తీశారు. పరంవా స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ ఏ ఏడాది జనవరిలో రిలీజ్ అయింది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఆ తరువాత ఆమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇందులోని పాటలను కాపీ కొట్టారని గతంలోనే ఎంటీఆర్ స్టూడియోస్ గతంలోనే ఆరోపించారు. దీంతో రక్షిత్ శెట్టి ఆ సంస్థ యాజమాన్యంతో కలిసి మాట్లాడారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. లేటేస్ట్ గా రక్షిత్ శెట్టిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది.

    2014లో రక్షిత్ శెట్టి ‘సిపుల్ సుని’తో నిర్మాతగా మారాడు. ‘ఉలిదవరు కందంటే’ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకున్న రక్షిత్ శెట్టి ‘కిరిక్ పార్టీ’ అనే కామెడీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ సంచలన విజయం సాధించింది. కామెడీతో కడుపుబ్బా నవించిన ఈ సినిమాతో రక్షిత్ శెట్టి సౌత్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు. ఈ క్రమంలో ఆయన కర్ణాటక చలన చిత్రోత్సవ అవార్డును అందుకున్నారు.

    రక్షిత్ శెట్టి 2014లో కిరిక్ పార్టీని తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాణ సమయంలో హీరోయిన్ రష్మికా మందానా తో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగా 2017 జూలై 3న నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఆ తరువాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. వీరు విడిపోయిన తరువాత రష్మిక మందాన బాలీవుడ్ రేంజ్ కు ఎదిగిపోయిన విషయం తెలిసిందే.

    నోటీసుల విషయంపై రక్షిత్ శెట్టి ఇంకా స్పందించలేదు. అయితే మరోసారి ఎంఆర్టీ తో సమావేశం అవుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ‘బ్యాచ్ లర్ పార్టీ’ యావరేజ్ గా ఉన్న యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇందులోని పాటలు సక్సెస్ ఫుల్ అయ్యాయి. అయితే ఇందులోని రెండు పాటలను తమ సంస్థ నుంచి కాపీ కొట్టారని ఎంఆర్ టీ మ్యూజిక్ లో భాగస్వామిగా ఉన్న నవీన్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.