TATA Nano : ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా సాగుతోంది. కొత్తగా కారు కొనాలని అనుకునేవారు విద్యుత్ కార్ల వైపే ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. పెట్రోల్ ధరలు తగ్గకపోవడంతో పాటు మెయింటెనెన్స్ ఎక్కువగా ఉండటంతో సాంప్రదాయ కార్లకు బదులు విద్యుత్ కార్లనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో కంపెనీలు సైతం విద్యుత్ కార్లను మాత్రమే మార్కెట్లోకి తీసుకురావడానికి ఫోకస్ చేస్తున్నాయి. అయితే విద్యుత్ కారు కొనాలని అనుకునే వారికి టాటా కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ కంపెనీ నుంచి వస్తున్న లేటెస్ట్ Nano EV గురించి అప్డేట్ న్యూస్ అందించింది. ఆ వివరాల్లోకి వెళితే..
SUV లతోపాటు సామాన్యులకు కారు అందించాలనే ఉద్దేశంతో టాటా కంపెనీ బడ్జెట్ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా లక్ష రూపాయలకే కారు అందించాలని Nano కారును 2008లో వినియోగదారులకు అందించింది. అయితే కొన్ని సంవత్సరాల పాటు దీనిని కొనుగోలు చేశారు. కానీ ఆ తర్వాత ఇది అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో 2018లో నానో కారు ఉత్పత్తిని నిలిపివేశారు. అయితే నేటి వినియోగదారులకు అనుగుణంగా దీనిని ఎలక్ట్రిక్ వెర్షన్ లో మార్చి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చే నానో 2025 కారు సైతం సామాన్యులకు అందుబాటులోనే ధరలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అవి ఎలా ఉన్నాయంటే?
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఏడాది డిసెంబర్ చివరిలోగా లేదా 2025 ఏడాదిలో ఎప్పుడైనా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ కారు కొనాలని ఎదురుచూస్తున్న వారు ఆశతో ఉన్నారు. అయితే ఈ కారు ఎలా ఉందో తెలుసుకోవాలని ఆత్రుతతో ఉంటున్నారు వీరి కోసం ప్రాథమికంగా కొంత సమాచారం బయటకు వచ్చింది. 2025 విద్యుత్ నానో కారులో 17 కిలో వాట్ బ్యాటరీ ఉండనుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్ ఉండే ఈ కారును చార్జింగ్ చేసేందుకు 6 నుంచి 8 గంటల పాటు సమయం పట్టనుంది.
ఈ కారు ఇన్నర్లో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ను అమర్చారు. ప్రత్యేకంగా బ్రేక్ సిస్టం కలిగి ఉండే ఈ కారు మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్లతో ఉండనుంది. డ్రైవింగ్ ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. కంఫర్ట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదని చర్చ సాగుతోంది. అన్ని అద్భుత ఫీచర్లతో కలిగిన ఈ కారును సామాన్యులకు అందించే ఉద్దేశంతో దీనిని 2.5 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి తీసుకురానున్నారు. అయితే హై ఎండ్ ఫీచర్లు కావాలని అనుకునే వారు రూ. 8 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఆటోమోబైల్ రంగంలో ఇప్పటికే లక్ష రూపాయల కారు అందించి సంచలనం సృష్టించిన టాటా కంపెనీ.. ఇప్పుడు ఈవీ వెర్షన్ లో అతి తక్కువ ధరకే కారు అందించి సరికొత్త ఒరవడిని సృష్టించాలని ప్రయత్నిస్తుంది. అయితే ఈ కారు ఎంత వేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.