TaTa Tiago EV: భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. వాతావరణ కాలుష్యం, చమురు ధరల కారణంగా చాలా మంది వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఈవీల ఉత్పత్తిపై ఫోకస్ పెట్టాయి. వీటిలో టాటా కంపెనీ అతి తక్కువ ధరలో ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చిన టియాగోను ఈవీగా మార్చి మార్కెట్లో రిలీజ్ చేసింది. టియాగో ఈవీ ఫీచర్స్, ధర కొనుగోలుదారులను ఆకర్షించింది. అయితే తాజాగా ఇందులో కొత్త ఫీచర్ ను యాడ్ చేశారు. అదెంటంటే?
టాటా టియాగో ప్రస్తుతం రెండు బ్యాటరీ ప్యాక్ లను కలిగి ఉంది. ఇందులో ఒకటి 24kWh, రెండోది 24kWh కలిగి ఉంది. ఇవి 60 బీహెచ్ పీ పవర్ 110 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. ఒక్కసారి ఇవి ఛార్జి చేస్తే 250 కిలోమీటర్ల నుంచి 315 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. వీటితో పాటు ఇందులో 4 లెవల్స్ బ్రేక్ రీజనరేషన్, 2 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. లాంగ్ జర్నీలో 73 బీహెచ్ పీ పవర్, 114 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
వీటితో పాటు xz+tech lrs వేరియంట్ కు ఆటో డిమ్మింగ్ ఐఆర్ వీఎం అప్షన్ ను అందిస్తుంది. ఐఆర్వీఎం స్విచ్ ని ప్రస్తతం డ్రైవర్లు మాటిమాటికి మార్చాల్సిన అవసరం లేదు. xz+ వేరియంట్ లో 45 వాట్ యూఎస్ బీ పోర్ట్ వస్తోంది. మొబైల్ డివైజ్ ల ఛార్జింగ్ మరింత ఫాస్ట్ అవుతుంది. ఈ ఫీచర్స్ తో ఈ కారును రూ.7.99 లక్షల ప్రారంభ ధర నుంచి 11.89 లక్షల వరకు విక్రయించనున్నారు.
అయితే ఇందులో కొత్తగా పోలెన్ ఎయిర్ ఫిల్టర్, ఆటో ఫోల్డ్్ ఔట్ సైడ్ రెర్ వ్యూ మిర్రర్ ను యాడ్ చేశారు. xz+వేరియంట్లలో ఇవి ఉంటాయి. ఇక అన్ని వేరియంట్లలో బ్లాక్ రూప్ ను తొలగించింది. అయితే కొత్త వేరియంట్లను యాడ్ చేసినా కారు ధర మాత్రం పెంచలేదు. ఇదిలా ఉండగా టియాగో సేప్టీ విషయంలో ప్రత్యేకతను చాటుకుంది. ఇందులో డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రేర్ పార్కింగ్ సెన్సార్ వంటివి ఉన్నాయి.