Homeబిజినెస్Maruti Suzuki Alto K10 Electric Car: Maruti Suzuki కార్లు కొనేవారికి గుడ్ న్యూస్.....

Maruti Suzuki Alto K10 Electric Car: Maruti Suzuki కార్లు కొనేవారికి గుడ్ న్యూస్.. త్వరలోనే బెస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ధర బడ్జెట్ లోనే..

Maruti Suzuki Alto K10 Electric Car: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఈవీ లను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. అయితే దేశంలో అత్యధికంగా కార్ల విక్రయాలు జరిపే Maruti Suzuki నుంచి దశాబ్దాల కిందట మార్కెట్లోకి వచ్చిన ఆల్టో k10 కారు ఎంతో ఆదరణ పొందింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే ఈ కారు ఇప్పటివరకు పెట్రోల్ వేరియంట్ తో అలరించింది. అయితే ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో రాబోతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించిన మారుతి సుజుకి త్వరలో దీనిని రోడ్లపై తిప్పేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా దీనికి సంబంధించిన ఫీచర్స్ ను అప్డేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయి? బ్యాటరీ ఏ విధంగా పనిచేయనుంది? పూర్తి వివరాల్లోకి వెళితే..

అతి తరగతి ప్రజలు కారును కొనాలని అనుకుంటే ముందుగా మారుతి కంపెనీకి చెందిన కార్ల వైపే చూస్తుంటారు. వీరికి అనుగుణంగా దశాబ్దాల కిందట ఆల్టో k10 కారు అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ కు అనుగుణంగా ఈ కారును తీర్చిదిద్దారు. అయితే ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ కారుగా రాబోతుండడంతో చాలామంది దీనికోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వేరియంటు అయినప్పటికీ దీని ధర అందుబాటులోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్లోకి వస్తే ధర రూ. 5.50 లక్షల నుంచి రూ.9.00 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో సమర్థవంతమైన బ్యాటరీ ప్యాక్ ఉంచనున్నారు. దీనిపై ప్రకటించినప్పటికీ ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. నగరాల్లో ఉండే వారితోపాటు లాంగ్ జర్నీ చేసే వారికి ఈ బ్యాటరీ బాగా సరిపోతుందని చెబుతున్నారు.

Also Read: AMT గేర్ బాక్స్ కార్లను ఎందుకు ఎక్కువగా కోరుకుంటున్నారు? అలాంటి కార్లు ఏవి?

ఆల్టో k10 ఎలక్ట్రిక్ కారు ఎక్స్టీరియర్ డిజైన్ కూడా మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీని కాంపాక్ట్ డిజైన్ 3530 మిల్లీ మీటర్ల పొడవు, 1490 మిల్లీమీటర్ల వెడల్పు, 2380 మిల్లీమీటర్ల వీల్ బేస్ తో ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఇందులో స్మార్ట్ ఫీచర్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టం తో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సేఫ్టీ కోసం అవసరమైన ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ వంటి ఫీచర్లను చూడవచ్చు. ఇది మార్కెట్లోకి వస్తే ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎంజీ కామెట్ ఇవి కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 2026 సెప్టెంబర్ లో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version