Homeబిజినెస్Tata Tiago EV: ఎలక్ట్రిక్ వేరియంట్ లో అతి తక్కువ ధర కారు.. కానీ ఇందులో...

Tata Tiago EV: ఎలక్ట్రిక్ వేరియంట్ లో అతి తక్కువ ధర కారు.. కానీ ఇందులో కొన్ని మైనస్.. అవేంటంటే..

Tata Tiago EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతుంది. ఇందులో భాగంగా వినియోగదారులకు అనుగుణంగా కార్లను తీసుకురావడంతో టాటా మోటార్స్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ కొత్త మోడళ్లను తీసుకువస్తోంది. దూసుకుపోతోంది. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులను టార్గెట్ చేస్తూ తక్కువ బడ్జెట్‌లోనే బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ కంపెనీకి చెందిన ఓ కారు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి ప్రత్యేక ఆదరణ పొందుతోంది. బడ్జెట్ ధరలో ఈవీ కారు కొనాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇంతకీ అది ఏ కారు?

టాటా కంపెనీ నుంచి టియాగో ఈవీ (Tata Tiago EV) అత్యాధునిక ఫీచర్లు, నమ్మకమైన పర్ఫార్మెన్స్‌తో వినియోగదారుల మనసును దోచకుంటుంది. ఈ కారు డిజైన్ చాలా స్టైలిష్‌గా మరియు ట్రెండీగా ఉంటుంది. దీనికి క్లాసీ లుక్ ఇచ్చేలా ఎల్ఈడీ (LED) హెడ్‌ల్యాంప్స్, ఐబ్రో స్టైల్ ఎల్ఈడీలు మరియు వెనుక భాగంలో ట్రెండీ కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌ను అమర్చారు. కారు లోపల 10.25 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో తో పాటు ఆపిల్ కార్ ప్లేలను సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు కారులో 40కి పైగా స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి.

భద్రత విషయంలో టాటా మోటార్స్ ఎక్కడా రాజీ పడలేదు. చిన్న కారే అయినప్పటికీ ఇందులో ప్రీమియం సేఫ్టీ ఫీచర్లను జోడించారు. ప్రయాణికుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, కారును సులభంగా పార్కింగ్ చేయడానికి, సిటీ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయడానికి ఉపయోగపడే 360 డిగ్రీ కెమెరా, అలాగే లేన్ మారేటప్పుడు ప్రమాదాలను నివారించే బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

టాటా టియాగో ఈవీ అసలు ప్రారంభ ధర రూ. 6.99 లక్షలుగా ఉంది. అయితే, టాటా మోటార్స్ ఇందులో సరికొత్త ‘బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్’ (Battery as a Service) ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద కారు ప్రారంభ ధర ఏకంగా రూ. 4.69 లక్షలకే అందుబాటులోకి వస్తుంది. ఇందులో బ్యాటరీ ధరను మినహాయించి కారును అందిస్తారు. దానికి బదులుగా వినియోగదారులు బ్యాటరీ వినియోగానికి గానూ కిలోమీటర్ కు రూ. 2.60 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల కారును కొనుగోలు చేయడం మరింత సులభతరం కానుంది.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ కారు ఇంజన్ 75 BHP పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇది సిటీ రోడ్లపై, హైవేలపై స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. కేవలం 18 నిమిషాల ఛార్జింగ్‌తోనే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్ లభిస్తుంది. 30 కిలోవాట్ డీసీ (DC) ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించినప్పుడు, కేవలం 35 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది.

అయితే టాటా టియాగో ఈవీలో ఎన్నో పాజిటివ్ పాయింట్లు ఉన్నప్పటికీ, వినియోగదారులు గమనించాల్సిన కొన్ని చిన్న లోపాలు కూడా ఉన్నాయి. కారు లోపల డోర్లను లాక్ మరియు అన్‌లాక్ చేయడానికి ప్రత్యేకమైన బటన్ లేదు. ప్రస్తుత జనరేషన్ మొబైల్స్ ఛార్జింగ్ కోసం ఎక్కువగా వాడుతున్న యూఎస్‌బీ టైప్-సీ (USB Type-C) పోర్టులను ఇందులో ఇవ్వలేదు.సుదీర్ఘ ప్రయాణాల్లో మెడకు రక్షణ మరియు సౌకర్యాన్ని ఇచ్చే అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు లేకపోవడం గమనార్హం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular