TATA: టాటా మోటార్స్ తమ ఎలక్ట్రిక్ కార్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఏప్రిల్ 2025లో పలు ఎలక్ట్రిక్ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగానే, కంపెనీ అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV)పై గరిష్టంగా రూ. 70,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్‌లో నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉన్నాయి. డిస్కౌంట్ గురించిన మరింత సమాచారం కోసం వినియోగదారులు తమ సమీపంలోని డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. టాటా కర్వ్ ఈవీ ఫీచర్లు, డ్రైవింగ్ రేంజ్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.
Also Read: టాప్ 10లో మారుతిదే రాజ్యం.. అత్యధికంగా అమ్ముడవుతున్న 5 కార్లు ఇవే!
దుమ్మురేపే ఫీచర్లతో ఎలక్ట్రిక్ SUV
టాటా కర్వ్ ఈవీ క్యాబిన్‌లో వినియోగదారులకు 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, 12.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 9-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో పాటు 360-డిగ్రీ కెమెరా, ముందు పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, లెవెల్-2 ADAS వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, టాటా కర్వ్ ఈవీలో 2 బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించారు. 45 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 502 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక 55 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన వేరియంట్ అయితే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 585 కిలోమీటర్ల వరకు ఆగకుండా ప్రయాణించగలదని టాటా మోటార్స్ ధీమాగా చెబుతోంది. టాటా కర్వ్ ఈవీ వినియోగదారుల కోసం 5 రంగుల్లో అందుబాటులో ఉంది. భారతీయ మార్కెట్‌లో టాటా కర్వ్ ఈవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.49 లక్షల నుండి టాప్ మోడల్‌లో రూ. 21.99 లక్షల వరకు ఉంది.