Tata Stock: టాటా స్టాక్.. బద్దలు కొట్టింది అంతే.. ఏం రికార్డ్ సృష్టించిందో తెలుసా?

మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ కోసం సభ్యుల అర్హతను నిర్ణయించడానికి జూన్ 12, 2024 బుధవారం రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది.

Written By: Neelambaram, Updated On : May 18, 2024 6:37 pm

Tata Stock

Follow us on

Tata Stock: టాటా స్టాక్ అయిన టాటా కెమికల్స్ తన ఇన్వెస్టర్లకు డివిడెండ్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. టాటా గ్రూప్ కంపెనీ డివిడెండ్ ఎక్స్-డేట్, రికార్డ్ తేదీ, చెల్లింపు తేదీని కూడా నిర్ణయించింది.

టాటా కెమికల్స్ బోర్డు ఒక్కో షేరుపై 150 శాతం డివిడెండ్ చెల్లింపును ప్రకటించింది. డివిడెండ్ అనేది ఒక కంపెనీ తన వాటాదారులకు వ్యాపారంలో పెట్టుబడికి చెల్లించే నగదు బహుమతి. డివిడెండ్ ఎప్పుడూ ప్రతి స్టాక్ ముఖ విలువపై లెక్కి్స్తారు. దీన్ని షేర్ హోల్డర్లకు పంచుతారు.

2024, ఏప్రిల్ 29 సోమవారం జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో రూ.10 విలువ గల సాధారణ షేరుకు రూ.15 డివిడెండ్ ఇవ్వాలని సిఫారసు చేసినట్లు కంపెనీ ఒక ఫైలింగ్ లో తెలిపింది.

టాటా కెమికల్స్ డివిడెండ్
2024 రికార్డు తేదీ తదుపరి డివిడెండ్ లో వాటాదారుల భాగస్వామ్య అర్హతను నిర్ణయించడానికి టాటా కెమికల్స్ బోర్డు రికార్డు తేదీని కూడా నిర్ణయించింది.

టాటా కెమికల్స్ డివిడెండ్ రికార్డు
మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ కోసం సభ్యుల అర్హతను నిర్ణయించడానికి జూన్ 12, 2024 బుధవారం రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది.

టాటా కెమికల్స్ డివిడెండ్ చెల్లింపు తేదీ
టాటా కెమికల్స్ కూడా డివిడెండ్ చెల్లింపును ప్రకటించింది. రికార్డు తేదీలో వాటాదారులకు వారి అర్హతకు లోబడి డివిడెండ్ చెల్లిస్తారు. జూన్ 28, 2024 శుక్రవారం లేదా ఆ తర్వాత పన్ను మినహాయింపునకు లోబడి డివిడెండ్ చెల్లించబడుతుందని కంపెనీ తెలిపింది.

టాటా కెమికల్స్ డివిడెండ్ చరిత్ర
బీఎస్ఈ వెబ్ సైట్ ప్రకారం, టాటా కెమికల్స్ జూన్, 2023 లో ప్రతి షేరుపై రూ. 17.50 డివిడెండ్ చెల్లించింది. టాటా కంపెనీ జూన్, 2022 లో ప్రతి షేరుపై రూ. 12.50 డివిడెంట్ ను పంపిణీ చేయడం ద్వారా పెట్టుబడిదారులకు బహుమతి ఇచ్చింది. 2021, 2020 సంవత్సరాల్లో టాటా కెమికల్స్ ఒక్కో షేరుపై డివిడెండ్ కింద వరుసగా రూ.10, రూ.11 చెల్లించింది.

టాటా కెమికల్స్ ఎస్ అండ్ పీ బీఎస్ఈ 500లో ఒక భాగం. మే 18 నాటికి బీఎస్ఈ అనలిటిక్స్ ప్రకారం.. టాటా స్టాక్ గతేడాది 10 శాతం సానుకూల రాబడిని అందించింది.

టాటా కెమికల్స్ షేరు 52 వారాల శ్రేణి రూ.1,349.70 – రూ.933. బీఎస్ఈ వెబ్ సైట్ ప్రకారం మే 18 నాటికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.27,525.14 కోట్లుగా ఉంది.