Maruti Fronx vs Tata Punch
Maruti Fronx vs Tata Punch :మారుతి సుజుకి ఫ్రాంక్స్, టాటా పంచ్ రెండూ ప్రస్తుతం తమ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్స్. ఈ రెండు కార్లు CNG వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఫిబ్రవరి 2025లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. అయితే 2024 సంవత్సరానికి గాను టాటా పంచ్ ఆ స్థానాన్ని దక్కించుకుంది. ఈ రెండు కార్ల ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేనప్పటికీ వాటి మైలేజీలో మాత్రం చాలా తేడా కనిపిస్తుంది.
Also Read : తక్కువ బడ్జెట్‌లో పెద్ద కుటుంబానికి పర్ఫెక్ట్ కార్లు ఇవే!
మారుతి ఫ్రాంక్స్
మారుతి ఫ్రాంక్స్ CNG వేరియంట్ ARAI ప్రకారం కిలోకు 26కిమీ మైలేజ్‌ను అందిస్తుంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంది. ఇది CNG వేరియంట్‌లో మంచి బ్యాలెన్స్‌ను కలిగి ఉండడంతో పాటు మైలేజ్‌ను అందిస్తుంది. ఈ కారు లగ్జరీ ఇంటీరియర్‌ను కలిగి ఉంది. దీని డిజైన్ స్మార్ట్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. ఇంజన్ పవర్ కూడా మెరుగ్గా ఉండటంతో డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ బాగుంటుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ సిగ్మా, డెల్టా ట్రిమ్‌లలో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ ఎస్-సీఎన్‌జీ టెక్నాలజీ అందుబాటులో ఉంది. దీని సిగ్మా సీఎన్‌జీ వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 8.47 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
టాటా పంచ్
టాటా పంచ్ CNG వేరియంట్ ARAI ప్రకారం కిలోకు 23కిమీ మైలేజ్‌ను అందిస్తుంది. టాటా పంచ్‌లో కూడా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది CNG వేరియంట్‌లో మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. అయితే ఫ్రాంక్స్‌తో పోలిస్తే కొంచెం తక్కువ మైలేజ్‌ను ఇస్తుంది. అయినప్పటికీ, ఈ కారు స్టెబిలిటీ, సేఫ్టీ ఫీచర్లు చాలా అద్బుతంగా ఉంటాయి. ఈ కారు స్ట్రాంగ్ బాడీ, స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో మెరుగైన భద్రతా ఫీచర్లు లభిస్తాయి. దీని రైడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ కూడా టాప్-క్లాస్‌లో ఉంటుంది. టాటా పంచ్ CNG ప్యూర్ ఐసీఎన్‌జీ, అడ్వెంచర్ రిథమ్ ఐసీఎన్‌జీ, అడ్వెంచర్ ఎస్ ఐసీఎన్‌జీ, అకంప్లిష్డ్ ప్లస్ సీఎన్‌జీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. టాటా పంచ్ CNG, ప్యూర్ ఐసీఎన్‌జీ వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్ రూ.7.30 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
మైలేజ్ విషయానికి వస్తే మారుతి ఫ్రాంక్స్ CNG వేరియంట్ (26 కిమీ/కిలోగ్రాము) టాటా పంచ్ CNG వేరియంట్ (దాదాపు 23 కిమీ/కిలోగ్రాము) కంటే కొంచెం ఎక్కువ మైలేజ్‌ను అందిస్తుంది. మైలేజ్ విషయంలో ఫ్రాంక్స్‌కు స్వల్ప ఆధిక్యం ఉంది. టాటా పంచ్ తన అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీకి ఎక్కువ మంది వినియోగదారులు ముగ్ధులవుతున్నారు.
Also Read : రేపే రారాజులా మార్కెట్లోకి రిలీజ్ కాబోతున్న క్లాసిక్ 650.. ఇక తిరుగు లేదంతే !
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Maruti fronx vs tata punch comparison between maruti fronx and tata punch
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com