Tata Punch Facelift : దేశంలోని కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తోంది మారుతి కంపెనీ. ఈ కంపెనీకి పోటీగా ఎన్నో వచ్చాయి. కానీ టాటా మాత్రం మారుతికి గట్టి పోటీ ఇస్తోంది. SUV కార్లను ఉత్పత్తి చేయడంలో టాటా కంపెనీ ముందు ఉంటుంది. దీని నుంచి రిలీజ్ అయిన ఎస్ యూవీలు చాలా మంది కారు వినియోగదారులు ఆదరించారు. ఇదే ఊపులో 2021లో టాటా పంచ్ మార్కెట్లోకి వచ్చింది. పంచ్ ఫీచర్స్, ఇంజిన్ పనితీరుకు ఆకర్షితులై చాలా మంది ఈ మోడల్ ను కొనుగోలు చేశారు. అయితే తాజాగా పంచ్ ఫేస్ లిప్ట్ గా మారి కొత్త రకంగా వస్తోంది. దీని వివరాల్లోకి వెళితే..
టాటా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన SUV పంచ్ ఫేస్ లిప్ట్ వెర్షన్ రాబోతుంది. కొత్త టాటా పంచ్ టెస్టింగ్ సమయంలో అత్యధిక రేటింగ్ పొందింది. ఇందులో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, ఈవీ వంటి డ్యాష్ బోర్డును కలిగి ఉంటుంది. వీటితో పాటు 360 డిగ్రీ కెమెరా, లెథెరెట్ సీట్లు, ఆటో హోల్డ్ తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
2023లో టాటా పంచ్ రిలీజ్ సమయంలో రెండు సిలిండర్ తో CNG వెర్షన్ ను అమర్చారు. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్ తో అప్డేట్ చేయబడింది. దీనిని 2025లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఈవీ తరహాలో నవీకరించబడిన ట్విన్ సిలిండర్, CNG కార్ల కంటే ఎక్కువ బూట్ స్పేస్ ను కలిగి ఉంది. ఇందులో iCNG 210 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. అంటే ఇందులో లగేజీ సమస్య ఉండదని తెలుస్తోంది.
కొత్త టాటా పంచ్ రూ.6.13 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉంది. గ్లోబల్ లెవల్లో ఇప్పటికే 5 స్టార్ రేటింగ్ పొందిన ఈ మోడలల్ మాన్యువల్ పెట్రోల్ మోడల్ లో 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ సీఎన్ జీ మోడల్ లో 27 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లే అవకాశం ఉంది. కొత్త ఫేస్ లిప్ట్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు టాటా పంచ్ మరింత ఆకర్షిస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.