Homeబిజినెస్Tata Nexon Pure Plus S: ఇప్పుడు తక్కువ బడ్జెట్ లోనూ అద్భుతమైన ఫీచర్లతో కారు.....

Tata Nexon Pure Plus S: ఇప్పుడు తక్కువ బడ్జెట్ లోనూ అద్భుతమైన ఫీచర్లతో కారు.. ఏ కంపెనీదో తెలుసా..

Tata Nexon Pure Plus S: భారతీయ ఆటోమోబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ తన పట్టును నిలుపుకునేందుకు నిరంతరం సరికొత్త అప్‌డేట్స్‌తో కార్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) అయిన టాటా నెక్సాన్ (Tata Nexon) లైనప్‌లో సరికొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఈ విభాగంలోనే మొట్టమొదటిసారిగా పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను పరిచయం చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. సాధారణంగా ఈ ఫీచర్ ప్రీమియం కార్లలోనే ఉంటుంది. కానీ ఈ కంపెనీ బడ్జెట్ వెహికల్స్ లోనూ తీసుకొస్తుంది. ఇంతకీ ఆ కారు ఏది?

టాటా నుంచి ‘నెక్సాన్ ప్యూర్ ప్లస్ ఎస్’ వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ అనే ఫీచర్ ను అనేది కేవలం లగ్జరీ మరియు ప్రీమియం ఎస్‌యూవీలలో (నెక్సాన్ టాప్ వేరియంట్లు లేదా అంతకంటే పై విభాగాల్లో) మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, టాటా మోటార్స్ ఈ ప్రీమియం ఫీచర్‌ను బడ్జెట్ శ్రేణికి దగ్గరగా ఉండే మిడ్-స్పెక్ ‘ప్యూర్’ ట్రిమ్‌లోనే అందించడం విశేషం. దీనివల్ల ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండానే మధ్యతరగతి వినియోగదారులు కూడా లగ్జరీ కార్ల అనుభూతిని పొందే అవకాశం లభిస్తుంది.

టాటా కంపెనీకి చెందిన నెక్సాన్ ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్ పెట్రోల్ మరియు డీజిల్.. రెండు ఇంజన్ ఆప్షన్లలోనూ అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.10.10 లక్షలుగా ఉంది. డీజిల్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.11.60 లక్షలుగా నిర్ణయించారు.

ఈ సరికొత్త వేరియంట్ లో కేవలం సన్‌రూఫ్‌కే మాత్రమే కాకుండా మరిన్ని అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇందలో క్యాబిన్‌లోకి అద్భుతమైన వెలుతురును తెస్తూ, కారు లోపల విశాలమైన అనుభూతిని ఇస్తుంది. దీనిని వాయిస్ అసిస్టెంట్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే 7అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇందులో అందించారు. ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

టాటా కార్లంటేనే భద్రతకు కేరాఫ్ అడ్రస్. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ కంట్రోల్, మరియు త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్‌లను స్టాండర్డ్‌గా అందించారు. ఈ వేరియంట్‌లో పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్లను అందించారు. 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్: ఇది 120 PS పవర్‌ను, 170 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ AMT గేర్‌బాక్స్ జత చేశారు. 1.5-లీటర్ రెవోటోర్క్ డీజిల్ ఇంజన్: ఇది 115 PS పవర్‌ను, 260 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది కూడా మాన్యువల్ మరియు AMT ఆప్షన్లలో లభిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular