Homeబిజినెస్Tata Nexon : పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్.. అన్ని ఆప్షన్లలో దుమ్మురేపుతున్న టాటా మోడల్

Tata Nexon : పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్.. అన్ని ఆప్షన్లలో దుమ్మురేపుతున్న టాటా మోడల్

Tata Nexon : టాటా నెక్సాన్ చూడటానికి అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇది అనేక లేటెస్ట్ ఫీచర్లతో నిండి ఉంటుంది. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. దీని డ్రైవింగ్ క్వాలిటీ, పర్ఫామెన్స్, స్టెబిలిటీ కూడా అద్భుతంగా ఉన్నాయి. గత నెల ఏప్రిల్‌లో అమ్మకాల పరంగా టాటా నెక్సాన్ మారుతి బాలెనో,మారుతి వేగన్‌ఆర్ వంటి పాపులర్ కార్లను కూడా వెనక్కి నెట్టింది. టాటా నెక్సాన్ టాప్ 10 అమ్ముడైన కార్లలో 6వ స్థానంలో నిలిచింది. టాటా మొత్తం 15,457 యూనిట్ల నెక్సాన్‌ను విక్రయించింది. ఏప్రిల్‌లో మారుతి కేవలం 13,180 బాలెనో, 13,413 వేగన్‌ఆర్ యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది.

బేస్ మోడల్ కోసం టాటా నెక్సాన్ ధర రూ.9.06 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ ధర రూ.18.41 లక్షల వరకు (ఆన్-రోడ్ ఢిల్లీ) ఉంటుంది. టాటా నెక్సాన్ ప్రధాన పోటీదారులు మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV300, ఎంజీ హెక్టర్.

Also Read : టాటా నెక్సాన్ ఈవీ టెస్టులో పాస్ అయిందా.. నిజంగా కంపెనీ చెప్పినంత రేంజ్ ఇస్తుందా ?

అత్యంత సేఫ్టీ కారు
టాటా నెక్సాన్ ఇండియాలో చాలా పాపులారిటీ సంపాదించిన కాంపాక్ట్ ఎస్యూవీ. ఇది దాని భద్రత, డిజైన్, ఫీచర్ల కారణంగా పాపులర్ అయింది. టాటా నెక్సాన్ గ్లోబల్ NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన భారతదేశపు మొట్టమొదటి కారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ESP, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. దీని డిజైన్ మస్క్యులర్, మోడర్న్‌గా ఉంటుంది. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ దీని సొంతం.

ఇంజిన్, పర్ఫామెన్స్
ఈ కారు పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ అనే నాలుగు ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. దీనితో పాటు మాన్యువల్, AMT, DCT గేర్‌బాక్స్ ఆప్షన్‌లు ఉన్నాయి. టాటా నెక్సాన్ లోపల అనేక అద్భుతమైన, లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ప్రీమియం ఇంటీరియర్ ఉంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (Android Auto, Apple CarPlay సపోర్ట్‌తో), డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో క్లైమేట్ కంట్రోల్, రియర్ AC వెంట్స్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాదు, నెక్సాన్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, వాయిస్ కమాండ్స్, IRA కనెక్టెడ్ కార్ టెక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా ఉన్నాయి.

Also Read : ఎగబడి కొంటున్నారు.. ఈ కారు గురించి తెలుసా?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular