Sandeep Vanga : చిన్నతనం లో మెగాస్టార్ చిరంజీవి కి అభిమాని అవ్వని మనిషి అంటూ ఎవరైనా ఉంటారా..?, కుల అహంకారం తో అతని ఎదుగుదలకి ఓర్వలేక, అసూయతో తగిలిపోయే ఒక వర్గం తప్ప, నటుడిగా మెగాస్టార్ చిరంజీవిని ఇష్టపడని తెలుగు వాళ్ళు ఉంటారా అంటే అనుమానమే. ఆయన యాక్షన్, కామెడీ, డ్రామా, సెంటిమెంట్, మాస్, క్లాస్ ఇలా అన్ని కోణాల్లో తన విశ్వరూపం చూపించి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు కమర్షియల్ సినిమాని చిరంజీవికి ముందు, చిరంజీవికి తర్వాత అని విభజించవచ్చు. ఆయన వచ్చిన తర్వాతే తెలుగు కమర్షియల్ సినిమాలో డ్యాన్స్, ఫైట్స్ వేగం అందుకున్నాయి. సినీ సెలెబ్రిటీలు కూడా ఇండస్ట్రీ లో 90 శాతం చిరంజీవి అభిమానులే. అందులో ‘ఎనిమల్’ డైరెక్టర్ సందీప్ వంగ కూడా ఉన్నాడు. తెలుగు వాడిగా కెరీర్ ని మొదలుపెట్టి, నేడు పాన్ ఇండియా లెవెల్ లో మన తెలుగోడి సత్తాని సందీప్ వంగ ఏ విధంగా చాటిచెప్పాడో మనమంత చూస్తూనే ఉన్నాం.
అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని అవ్వడమంటే తెలుగు ఆడియన్స్ లో మెగాస్టార్ వేసిన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కాసేపటి క్రితమే ఆయన తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో తన ఇంటి ఫ్రంట్ వ్యూ ని ఫోటో తీసి పెట్టుకున్నాడు. ఆ ఫొటోలో ప్రారంభంలోనే మెగాస్టార్ చిరంజీవి ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటి లోపల వైపు చూస్తే చిన్నప్పటి నుండి తనని ప్రభావితం చేసిన కొన్ని హాలీవుడ్ యాక్షన్ సినిమాల ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. వీటి అన్నిట్లో చిరంజీవి ఫోటో ఫ్రేమ్ బాగా హైలైట్ అయ్యింది. మెగా అభిమానులు దానిని షేర్ చేస్తూ సోషల్ మీడియా లో చిరంజీవి స్థాయి ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ వంగ కి ఉన్నటువంటి ఆలోచనలతో మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా తీస్తే చూడాలని కోరికగా ఉందంటూ సోషల్ మీడియాలో అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
చిరంజీవి తో సినిమా తీస్తాడో లేడో ఇప్పట్లో చెప్పలేము కానీ, స్పిరిట్ తర్వాత ఆయన చిరంజీవి తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అనేది మాత్రం ఖరారైంది. రీసెంట్ గానే ఆయన రామ్ చరణ్ ని కలిసి స్టోరీ ని వినిపించగా, చాలా బాగుందని, స్క్రిప్ట్ ని డెవలప్ చేసి తీసుకొనిరా, మనం ఈ సినిమా చేస్తున్నాం అంటూ రామ్ చరణ్ చెప్పాడట. నిన్న రాత్రి ఈ విషయం సోషల్ మీడియా లో లీక్ అయ్యి బాగా వైరల్ అయ్యింది. అయితే ఈ సినిమా కార్యరూపం దాల్చి విడుదల అయ్యేలోపు 2029 వ సంవత్సరం వచ్చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత వెంటనే సుకుమార్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాతే సందీప్ చిత్రం ఉండొచ్చు.