Tata Nano EV: టాటా మోటార్స్ మరో సంచలనం.. రూ.1.65 లక్షలకే ఈవీ కారు.. త్వరలో మార్కెట్లోకి.. పిచ్చెక్కిస్తున్న ఫొటోస్..

తక్కువ ధరలో కారు కొనాలని అనుకునేవారికి టాటా మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త కారును మార్కెట్లోకి తీసుకురాబోతుననట్లు సంకేతాలు పంపింది. అయితే ఇది ఒక ఎలక్ట్రిక్ కారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా కొనసాగుతోంది. దాదాపు అన్ని కంపెనీలు ఈవీల ను మార్కెట్లోకి తీసుకు రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా టాటా మోటార్స్ సైతం సరికొత్త ఈవీని పరిచయం చేయడానికి రెడీ అవుతోంది.

Written By: Chai Muchhata, Updated On : July 16, 2024 4:10 pm

Tata Nano EV

Follow us on

Tata Nano EV: కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ సంచలనం సృష్టించింది. సామాన్యుడికి సైతం కారు ఉండేలా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా కేవలం లక్ష రూపాయలకే బుల్లి కారును అందించి తన ప్రత్యేకతను చాటుకుంది. TaTa కంపెనీ నుంచి రిలీజ్ అయిన NaNo కారు లో బడ్జెట్ కావడంతో చాలా మంది దీనిని దక్కించుకున్నారు. కానీ అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో దీని ఉత్పత్తిని నిలిపివేశారు. అయితే ఇదే టాటా కంపెనీ మరో సంచలనానికి రెడీ అవుతోంది. త్వరలో రూ.1.65 లక్షలతో మరో కారును తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన ఫొటోలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ధర కూడా తెలిసిపోవడంతో వినియోగదారులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

తక్కువ ధరలో కారు కొనాలని అనుకునేవారికి టాటా మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త కారును మార్కెట్లోకి తీసుకురాబోతుననట్లు సంకేతాలు పంపింది. అయితే ఇది ఒక ఎలక్ట్రిక్ కారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా కొనసాగుతోంది. దాదాపు అన్ని కంపెనీలు ఈవీల ను మార్కెట్లోకి తీసుకు రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా టాటా మోటార్స్ సైతం సరికొత్త ఈవీని పరిచయం చేయడానికి రెడీ అవుతోంది. సాధారణంగా ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం రూ.10 లక్షలకు పైగానే ఉన్నాయి. కానీ టాటా మోటార్స్ మాత్రం రూ.1.65 లక్షలకు అందిస్తానని అంటోంది.

టాటా కంపెనీ గతంలో తీసుకొన్ని నానో పేరు మీదనే ఈవీని తీసుకురాబోతుంది. ఇది ధర తక్కువైనా ఫీచర్లలో మాత్రం తగ్గేదేలే అంటోంది. ఇందులో ప్రత్యేకమైన మోటార్, బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉండనుంది. ఇది వేగవంతంగా ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం టాటా నానో ఈవీని పరీక్షిస్తున్నారు. ఇవి విజయవంతం అయితే త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నారు. అయితే పాత నానో మాదిరిగి ఇది ఫెయిల్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా కొత్త ఈవీలకు పోటీ ఇచ్చేందుకు లేటేస్ట్ టెక్నాలజీని అందిస్తున్నారు. అలాగే ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఈవీల ఫీచర్స్ కు అనుగుణంగా ఇందులో ఉండనున్నాయని అంటున్నారు.

ఇప్పటికే చాలా కంపెనీలు పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఈవీలను చేర్చుతున్నారు. ఇప్పుడు టాటా మోటార్స్ సైతం రంగంలోకి దిగి ఈవీని తీసుకొస్తుంది. అయితే మిడిల్ క్లాస్ పీపుల్స్ కు తక్కువ ధరకు అందించేలా కొన్ని కంపెనీలు రూ.10 లక్షల లోపు వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ టాటా మోటార్స్ ఏకంగా రూ.1.65 లక్షల రూపాయలకే ఈవీని అందిస్తోంది. లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న ఈ మోడల్ కారు ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదల అయ్యాయి.

అయితే దీనిపై ఆటోమోబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ కారు మార్కెట్లోకి వస్తే మిగతా ఈవీలపై ప్రభావం ఉంటుందని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం పనితీరు తెలుసుకున్నాకే.. కారు గురించి అంచనా వేయాలంటున్నారు. అయితే కారు మోడల్ ఫొటోలను బయటకు రిలీజ్ చేశారు. కానీ ఫీచర్ల గురించి మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. కానీ మిగతా ఈవీల కంటే ఇందులో ప్రత్యేకమైన బ్యాటరీ వ్యవస్థ ఉంటుందని అంటున్నారు.

చైనాకు చెందిన ఓ కంపెనీ ఇటీవల బుల్లి ఈవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. భారత్ లో నూ లో బడ్జెట్ కారును తయారు చేయొచ్చని టాటా మోటార్స్ నిరూపిస్తోంది. మరి టాటా నానో ఈవీ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో? దానిని ఎలా దక్కించుకోవాలోనని వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.