Newborn Breastfeeding: బిడ్డకు తల్లి రక్షణ చాలా అవసరం. పుట్టిన బిడ్డకు మరింత అవసరం. ఆ బిడ్డ పుట్టగానే ఏడిస్తే తల్లి తండ్రి ఆ సౌండ్ విని ఎంత సంతోషిస్తారు కదా. అయితే పిల్లల విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. ఎప్పుడు పాలు ఇవ్వాలి? తల్లికి పాలు ఎప్పుడు పడతాయి? ఎన్ని సార్లు పాలు ఇవ్వాలి? వంటి చాలా అనుమానాలు ఉంటాయి. మీకు ఇలాంటి డౌట్స్ ఉండే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు మనం తెలుసుకుందామా?
సాధారణంగా ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుంది. కానీ డెలివరీ తర్వాత ఈ హార్మోన్స్ పడిపోతాయట. అయితే ఈ సమయంలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ బ్రెస్ట్ మిల్క్ తయారు అవడానికి సహాయం చేస్తుంటుంది. శిశువును చూడటం, ఆ శిశువుతో సమయం గడపడం, శిశువు పాలు తాగడానికి ప్రయత్నించడం, బేబీ ఏడ్పు వినడం వంటివి జరుగున్నప్పుడు తల్లికి ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఈ సమయంలోనే తల్లి పాలు బయటకు వస్తుంటాయి. అందుకే శిశువు పుట్టిన 30 ని.ల లోపు ఆ బిడ్డకు కచ్చితంగా పాలు పట్టించాలి అంటున్నారు నిపుణులు.
చాలా మంది డెలివరీ తర్వాత ముర్రుపాలు వస్తాయని ఆలస్యంగా పాలు పట్టిస్తుంటారు. కానీ ఈ ముర్రుపాలు పిల్లలకు చాలా మంచివి. కనీసం ఒక డ్రాప్ అయినా సరే అవి అమృతంతోని సమానం అంటున్నారు నిపుణులు. వీలైనంత త్వరగా తల్లి పాలు శిశువుతో తాగిస్తే ఇద్దరికి కూడా చాలా మంచిదట. అయితే బ్రెస్ట్ నుంచి కొలెస్ట్రామ్ రిలీజ్ అవుతుంటుంది. ఇదే తల్లిదండ్రి ఇచ్చే ఆస్తుల కంటే కూడా గొప్పది అంటున్నారు నిపుణులు. ఇది క్రీమీగా, కాస్త పసుపు రంగులో ఉంటుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ముర్రుపాలు అంటారు.
Also Read: తాగు ‘బోతు’ అంటే అర్థం ఇదా..? అరే.. ఇన్నాళ్లు తెలియలేదేం..?
ఈ తల్లి పాలు పిల్లల ఎదుగుదలకు చాలా అవసరం. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో యాంటీబాడీస్ కూడా ఉంటాయి. శిశువును వ్యాధులతో పోరాడటానికి సహాయం చేస్తాయి ఈ పాలు. అయితే కొందరు ఈ పాలు పిల్లలకు జీర్ణం అవడానికి కాస్త సమయం పడుతుంది అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. త్వరగా పిల్లలకు జీర్ణం అవుతాయట. చనుబాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా చాలా ప్రయోజనం చేకూరుతుంది.
ఇందులో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది శిశువుకు చాలా అవసరం. వారి శరీరాన్ని రక్షిస్తుంది. అయితే ముందుగా తల్లికి కేవలం ఒక డ్రాప్, టూ డ్రాప్స్ మాత్రమే వస్తాయి. అయినా సరే బిడ్డకు ఆ పాలు పట్టించాలి అంటున్నారు నిపుణులు. ఇవి బంగారం కంటే కూడా మిన్న అంటున్నారు. సో ఇప్పుడు అర్థం అయిందా? పైన ప్రశ్నలకు సమాధానాలు? సింపుల్ గా చెప్పాలంటే బేబీ పుట్టిన 30 ని. ల లోపే పాలు పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా ముర్రుపాలను మిస్ చేయవద్దు.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.