Tata Mahindra Tesla: ఎట్టకేలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెస్లా కంపెనీ భారత్ లోకి అడుగు పెట్టింది. నేడు ముంబైలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని మేకర్ మాక్సిటీ మాల్‌లో టెస్లా తన మొదటి షోరూమ్‌ను ఓపెన్ చేసింది. ఇది భారత ఈవీ మార్కెట్లో సంచలనం అనే చెప్పాలి. గత కొంత కాలంలో ఇండియన్ ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కు డిమాండ్ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఆటోమొబైల్ కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి దించుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహకల్స్ సంప్రదాయ వాహనాలతో పోలిస్తే ధర ఎక్కువగా ఉంటాయి. అలాగే ఛార్జింగ్ వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇంకా కొంతమంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేందుకు ఆసక్తి చూపడం లేదు.
అందుకే కంపెనీలు Baas లాంటి సరికొత్త స్కీముల ద్వారా కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అంతే బ్యాటరీ కొనకుండా అద్దెకు తీసుకోవచ్చన్నమాట. కేవలం వెహికల్ కాస్ట్ మాత్రమే చెల్లించి వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. బ్యాటరీని మాత్రం కిలోమిటర్ల లెక్కన చెల్లించి అద్దెకు తీసుకోవచ్చు. వాస్తవానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ లో బ్యాటరీలకే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ స్కీం సక్సెస్ అవుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ మీద లైఫ్ టైం వారంటీలను కూడా కంపెనీలు ప్రకటిస్తున్నాయి..ఇన్ని రకాలుగా ఉంటేనే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేందుకు ఒకటికి రెండు సార్లు మనోళ్లు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే టెస్లా కంపెనీ తన కార్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీంతో టెస్లా కంపెనీ రాక దేశీయ కంపెనీలైన టాటా, హ్యుందాయ్, మహీంద్రాలాంటి వాటిపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.
Also Read: Tesla Mumbai Showroom: ఎట్టకేలకు ఇండియాలో టెస్లా.. ముంబైలో షోరూం స్పెషాలిటీ ఇదే
ప్రస్తుతానికి టెస్లా ఇండియాలో తన అమ్మకాలను ప్రభావితం చేయకపోవచ్చు. దీనికి ప్రధాన కారణం ధర. టెస్లా మార్కెట్‌లోకి మొదటగా తీసుకొచ్చే అవకాశం ఉన్న మోడల్ వై ధర సుమారు రూ.75లక్షల నుంచి రూ.90లక్షల వరకు ఉంటుంది. అయితే, భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో అత్యధిక అమ్మకాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య జరుగుతున్నాయి. ఈ ధరల రేంజ్ లో టాటా, మహీంద్రా వంటి కంపెనీలు టాప్ పొజిషన్లో ఉన్నాయి. టెస్లా ఈ మార్కెట్ సెగ్మెంట్‌లోకి రావడం లేదు. రాబోదు కాబట్టి దాని ప్రభావం తక్కువగానే ఉంటుంది.
ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో దాదాపు టాటా మోటార్స్ 70శాతం వాటాతో మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. వారి నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, పంచ్ ఈవీ వంటి మోడళ్లు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. టెస్లా ఖరీదైన మోడల్‌లను తీసుకొస్తుంది కాబట్టి టాటా మీద దాని ప్రభావం ఏం ఉండదు. అయితే టెస్లా రాకతో టాటా తన ప్రొడక్స్ క్వాలిటీ, టెక్నాలజీని మరింత పెంచుకునేందుకు ప్రయత్నించవచ్చు.
దేశీయ కంపెనీ మహీంద్రా కూడా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో ప్రస్తుతం చాలా కార్లను విక్రయిస్తోంది. వారి XUV400 వంటి మోడళ్లు మంచి అమ్మకాలు సాధిస్తున్నాయి. మహీంద్రా కూడా లో, మీడియం రేంజ్ సెగ్మెంట్‌పై దృష్టి పెడుతోంది. టెస్లా లాంటి బీఈ6 లాంటి మోడల్స్ ఇప్పటికే మహీంద్రా లాంచ్ చేసింది. వాటి ధర టెస్లాతో పోలిస్తే తక్కువగా ఉంది కాబట్టి టెస్లా ప్రభావం మహీంద్రా పై ఉండదు. ఇక హ్యుందాయ్ క్రెటా ఈవీ వంటి మోడళ్లతో ఈవీ మార్కెట్‌లో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. మారుతి సుజుకి కూడా ఈవీ రంగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. తన విటారా ఈవీని మార్కెట్లోకి తెస్తోంది. ఈ కంపెనీలు కూడా ఎక్కువ శాతం మీడియం రేంజ్ కార్లను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి, టెస్లా రాకతో భయపడాల్సిన అవసరం లేదు.
Also Read: Anand Mahindra : ఆనంద్ మహీంద్రా.. తన 44 ఏళ్ల కెరీర్ లో నేర్చుకున్నది అదే!
టెస్లా రాకతో దేశీయ కంపెనీలకు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. టెస్లా ఒక ప్రపంచ బ్రాండ్. దాని రాకతో ఈవీ మార్కెట్ దేశంలో విస్తరిస్తుంది. టెస్లా ప్రపంచంలోనే అడ్వాన్యుడ్ టెక్నాలజీతో కార్లను తయారు చేస్తుంది. దాని రాకతో దేశీయ కంపెనీలు తమ కార్ల క్వాలిటీ, బ్యాటరీ టెక్నాలజీ, ఫీచర్లను పెంచుకోవడానికి మరింత కృషి చేస్తాయి. టెస్లా తన సూపర్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను దేశంలో నిర్మిస్తుంది. ఇది దేశంలో ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడుతుంది.. ఇది మిగతా అన్ని కంపెనీల ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఉపయోగపడుతుంది.