Tata Curvv : భారతీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ గతేడాది ఆగస్టులో విడుదల చేసిన టాటా కర్వ్ SUVని ఇప్పుడు కొత్త అవతారంలో విడుదల చేసింది. టాటా కర్వ్ కూపే-SUV ని డార్క్ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. అంతకుముందు టాటా ఇండియన్ మార్కెట్‌లో హారియర్, సఫారి, నెక్సాన్, పంచ్ వంటి పాపులర్ SUVలను కూడా డార్క్ ఎడిషన్‌లో విడుదల చేసింది.
Also Read: రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్.. పోస్టులు, అర్హత, దరఖాస్తు విధానం…
టాటా కర్వ్ డార్క్ ఎడిషన్ ప్రారంభ ధరను 16.49 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. టాప్ మోడల్ కోసం ఇది 19.52 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. డార్క్ ఎడిషన్ కర్వ్ టాప్ మోడల్స్ అయిన అకాంప్లిష్డ్ S, అకాంప్లిష్డ్ +A తో విడుదల చేసింది.
కర్వ్ డార్క్ ఎడిషన్ ఎంత భిన్నంగా ఉంది?
డార్క్ ఎడిషన్ కర్వ్ డిజైన్‌లో మార్పులు చేయలేదు. డార్క్ లుక్ ఇవ్వడానికి బ్లాక్ కలర్‌లో ఉంచారు. ఇప్పుడు ఇది పూర్తిగా బ్లాక్ కలర్‌లో ఉంది. అదనంగా కర్వ్ ఫ్రంట్ గ్రిల్, అల్లాయ్ వీల్, విండ్‌స్క్రీన్‌తో టింటెడ్ రూఫ్ రెయిల్స్, హెడ్‌ల్యాంప్,టెయిల్ ల్యాంప్‌లపై స్మోక్డ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. కర్వ్ డార్క్ ఎడిషన్‌లో రెండు హెడ్‌ల్యాంప్‌లను కలిపే LED లైట్ స్ట్రిప్, షార్క్ ఫిన్ యాంటెన్నా, వాలుగా ఉన్న పైకప్పు ఉన్నాయి, ఇది కూపే-స్టైల్ లుక్‌ను అందిస్తుంది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే భిన్నంగా ఉంటుంది. మరొక ప్రత్యేకమైన ఫీచర్ రియర్ ఫెండర్‌పై డార్క్ ఎడిషన్ బ్యాడ్జ్.
ఇంటీరియర్, ఫీచర్లు
క్యాబిన్ లేఅవుట్ అలాగే ఉంటుంది, కానీ కర్వ్ డార్క్ ఎడిషన్ ఇంటీరియర్‌లో సాధారణ మోడల్ నుండి భిన్నంగా చేయడానికి కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. ఉదాహరణకు, ఇందులో ఆల్-బ్లాక్ థీమ్‌లో లెదరెట్ సీట్ అప్హోల్‌స్టరీ, డోర్ ట్రిమ్స్ ఉన్నాయి. ఫీచర్ల విషయానికొస్తే, కర్వ్ డార్క్ ఎడిషన్‌లో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 10.25-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 9 స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటుతో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రిక్లైనింగ్ రియర్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి.