Asopacharu: కొన్ని ప్రైవేటు పాటలలో సైతం నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక స్టార్ హీరోయిన్ తమ్ముడిని ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ పెళ్లయిన కొన్ని రోజులకే కొన్ని కారణాల వలన వీళ్ళ బంధం తెగిపోయింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ నటి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. బుల్లితెర మీద తన అందంతో, సహజమైన నటనతో పలు సీరియల్లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న. కానీ అనుకోకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకోవడంతో ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగిందని చెప్పొచ్చు. కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలో ఈమె ఒక స్టార్ హీరోయిన్ తమ్ముడిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. ఈ దంపతులకు ఒక పాప పుట్టింది. కానీ పెళ్లయిన కొన్ని రోజులకే కొన్ని మనస్పర్ధలు కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల తర్వాత ఈ అమ్మడు పలు ప్రైవేట్ పాటల లో నటించింది. ప్రస్తుతం ఈమె ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ నటి బట్టలు అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఈమె మరెవరో కాదు బుల్లితెర ప్రముఖ నటి చారు అశోప. కొన్ని ఏళ్ళ క్రితం ఈమె హిందీలో పలు సీరియల్స్లలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె మిస్ యూనివర్స్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సుస్మితసేన మరదలు. అంటే ఈమె సుస్మితసేన్ తమ్ముడి భార్య. సుస్మితసేన్ తమ్ముడు రాజీవ్ సెన్, చారు అశోప ప్రేమించుకొని 2019లో పెళ్లికూడా చేసుకున్నారు. 2021లో ఈ దంపతులకు జియానా అనే కూతురు జన్మించింది. కానీ వీరిద్దరూ పెళ్లి అయినా మూడు సంవత్సరాలకే 2023లో కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.
Also Read: మళ్ళీ బిజీ అయిపోయిన హీరోయిన్ కృతి శెట్టి..చేతినిండా సినిమాలే!
ప్రస్తుతం కూతురితో కలిసి చారు అశోప ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈమె బట్టలు అమ్ముతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఈమె ఆర్థిక ఇబ్బందులు పడుతుందని ఈ క్రమంలోనే ముంబై వదిలి వెళ్ళిపోయిందని అలాగే ప్రస్తుతం అవకాశాలు రాకపోవడంతో బట్టలు అమ్ముతుందని ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై నటి చారు అశోప స్పందించడం జరిగింది. హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడిన చారు అశోప ముంబైలో నివసించడం అంత ఈజీ కాదు. అక్కడ అదే ఇతర ఖర్చులతో సహా నెలకు లక్ష నుంచి లక్షన్నర వరకు అవుతుంది.
అలాగే నేను షూటింగ్ నిమిత్తం నైగవ్ వెళ్లినప్పుడు నా కూతురు జియానాను నాని సంరక్షణలో వదిలి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఆ సమయంలో నాకు ఎంతో కష్టంగా అనిపించేది. అందుకే నేను బాగా ఆలోచించుకొని బికనీరు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. నాది తొందరపాటు నిర్ణయం కాదు. ప్రస్తుతం నేను బట్టలు అమ్మడం గురించి చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఒక వ్యక్తి కొత్తగా ఏమైనా ప్రారంభించినప్పుడు వాళ్లకు ఇబ్బందులు తప్పవు. నాకు కూడా ప్రస్తుతం అదే జరుగుతుంది. నేనే బట్టల ఆర్డర్లు తీసుకుంటున్నాను, ప్యాకేజింగ్ చేస్తున్నాను, స్టాక్ మేనేజ్ చేస్తున్నాను అన్ని నేనే చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram