Tata Avinya X: భారత దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తమ ప్రతిష్టాత్మక ‘టాటా అవిన్యా ఎక్స్’ ఈవీ కారును భారత రోడ్లపై రోడ్ టెస్టింగ్ చేస్తూ కనిపించింది. పూర్తి గా కవర్ తో టెస్టింగ్ చేస్తున్న సమయంలో దీని స్పై పిక్చర్స్ వెలుగులోకి వచ్చాయి. 2027 నాటికి మార్కెట్లోకి రానున్న ఈ ఆల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, టాటా బ్రాండ్ నుంచి వస్తున్న అత్యంత ఖరీదైన కారు..
Tata Avinya X ఫంట్ర్ సైడ్ లో ఫుల్ విడ్త్ స్లిమ్ LED DRL లైట్ బార్ ఉండనుంది. బంపర్ మూలల్లో నిలువుగా అమర్చిన హెడ్‌ల్యాంప్స్ ఉంటాయి. వెనుక వైపు వ్రాప్‌అరౌండ్ LED టెయిల్ లాంప్స్ , రూఫ్ స్పాయిలర్ ఆకట్టుకుంటున్నాయి. కారు సైడ్ లుక్ చాలా పొడవైన వీల్‌బేస్ , ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్, ఏరో డిజైన్‌ను కలిగి ఉంది. డోర్ హ్యాండిల్స్ ప్లష్-ఫిట్టింగ్ డిజైన్‌తో వస్తున్నాయి.
టాటా అవిన్యా సిరీస్ కార్లు జెఆర్‌ఎల్ ప్రీమియం ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందుతున్నాయి. ఇది 800 V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌తో రానుంది. దీనివల్ల అల్ట్రా ఫాస్ట్ DC ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ కారు సింగిల్ మోటార్, డ్యూయల్-మోటార్ (AWD) వేరియంట్లలో లభించే అవకాశం ఉంది. లోపలి కేబిన్ ఫోటోలు ఇంకా బయటకు రానప్పటికీ, ఇది లగ్జరీ కార్ల తరహాలోనే మినిమలిస్ట్ లాంజ్ డిజైన్‌తో ఉంటుందని అంచనా.
పెద్ద సైజ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేలు, ప్రీమియం ఆడియో సిస్టమ్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్‌ను ఉపయోగించనున్నారు. అత్యుత్తమ డ్రైవింగ్ అనుభవం, భద్రత కోసం అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ , సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ ఫీచర్లు, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్ ఇందులో ఉంటాయి. ఈ ఎస్‌యూవీలో సుమారు 70kWh నుంచి 80kWh బ్యాటరీ ప్యాక్‌లను అందించే అవకాశం ఉంది. ఒకే పూర్తి ఛార్జ్‌పై ఇది 500 కిలోమీటర్లకు పైగా రియల్ వల్డ్ డ్రైవింగ్ రేంజ్ ను అందిస్తుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.


