Tata Altroz Racer:కార్ల మార్కెట్ లో టాటా కంపెనీ ప్రత్యేకత చాటుకుంది. వినియోగదారులను ఆకర్షించేలా వివిధ మోడళ్లను ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే నేటి కారు ప్రియులకు అనుగుణంగా లేటేస్ట్ పీచర్స్ తో ఈ కంపెనీ నుంచి కొత్త హ్యాచ్ బ్యాక్ రాబోతుంది. అదే అల్ట్రోజ్ రేసర్. ఈ కారు మార్కెట్లోకి రానున్నట్లు ఇప్పటికే టాటా ప్రతినిధులు తెలిపారు. అయితే లేటేస్టుగా ఎప్పుడొస్తుందో క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా దీని ధరపై కూడా ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఇంతకీ ఈ కారు ఎలా ఉందంటే.
టాటా నుంచి రిలీజ్ కాబోతున్న అల్ట్రోజ్ రేసర్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 120 హార్స్ పవర్ ను అందిస్తుంది. స్టాండర్ట్ మోడల్ కంటే 30 ఎన్ ఎం ఎక్కువగా ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఫీచర్ విషయానికొస్తే.. ఈ మోడల్ ఇన్నర్ లో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను అమర్చారు. హెడ్స్ ఆప్ డిస్ ప్లే, వాయిస్ అసిస్టెడ్ సన్ రూప్ ను అమర్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా స్టాండర్ట్ మోడల్ కంటే ఇది అడ్వాన్స్ డ్ ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.
ఎక్స్టీరియర్ పరంగా చూస్తే రేసర్ క్యాబిన్ స్పోర్టీ మోడల్ ను కలిగి ఉంటుంది. రిప్రెష్ చేయబడిన గ్రిల్స్, కాస్మోటిక్ అప్డేట్స్ అయి ఉండనున్నాయి. 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ ట్రిమ్ రూప్, వింగ్ మిర్ర్ర్, విండో లైన్ కు మాత్రమే కాకుండా పిల్లర్స్ ను కూడా కలగజేసే ఫీచర్లు ఉన్నాయి. దీనిని 2024 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో లో దీనిని ప్రదర్శించారు. అప్పటి నుంచి టాటా అల్ట్రోజర్ రేసర్ పై చాలా మంది మనసు పారేసుకున్నారు.
ఇక ఈ మోడల్ ను వచ్చే నెలలో మార్కెట్లో తీసుకు రానున్నారు. అయితే ఏ తేదీ అనేది మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈలోపై ధరపై ఒక అంచనాకు వచ్చేశారు. దీనిని రూ.9.20 లక్షల నుంచి 10.10 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని తెలు్తోంది. ఇదిలా ఉండగా టాటా అల్ట్రోజర్ రేసర్ మార్కెట్లోకి వస్తే హ్యుందాయ్ ఐ 20 ఎన్ లైన్ కారుకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.