Astrology: గ్రహాలలన్నింటిలో బృహస్పతిని గురువుగా భావిస్తారు. ఈ గ్రహం ఏ రాశిలో ప్రవేశిస్తుందో కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టనుంది. అంతేకాకుండా తొమ్మిది గ్రహాల్లో కెల్లా బృహస్పది సంపద, సంతాన సౌభాగ్యానికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. మే 31 నుంచి బృహస్పతి మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మూడు రాశుల వారికి ఏ పని చేసిన సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆ రాశులు ఏవంటే?
బృహస్పతి మేష రాశిలోకి ప్రవేశించడంపై కర్కాటక రాశిపై ప్రభావం పడతుంది. దీంతో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.వ్యాపారులకు అకస్మిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది.
తులారాశి వారికి బృహస్పతి గ్రహం మార్పు ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితితో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పటి నుంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
గురు గ్రహం వల్ల ధనుస్సు రాశి వారి జీవితాల్లో అనూహ్య మార్పులు వస్తాయి. ఈ రాశి వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. లక్ష్యాలను పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. ఈ కారణంగా ఎలాంటి ఒత్తిడి ఉండదు. వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది.