Loan : పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే ముందు చాలా మంది ఏజెంట్లు, బ్యాంకులు కొన్ని ఛార్జీల గురించి చెప్పరు. దీని వల్ల లోన్ మొత్తం ఖర్చు చాలా పెరుగుతుంది. ఇక పర్సనల్ లోన్‌లో ఎలాంటి ఛార్జ్ లు ఉంటాయో మీకు తెలుసా? వీటి గురించి కచ్చితంగా అవగాహన ఉండాలి. లేదంటే మీకు చాలా ఎక్కువ ఛార్జ్ అవుతుంది. అందుకే ఈ ఛార్జ్ ల గురించి తెలుసుకోండి. ఇంతకీ ఎలాంటి ఛార్జ్ లు ఉంటాయి అంటే?
ప్రాసెసింగ్ ఫీజు: లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలని ప్రాసెసింగ్ ఫీజ్ ను తీసుకుంటారు. లోన్ మొత్తంలో 1% నుంచి 3% వరకు ఛార్జ్ చేస్తారు.
ముందస్తు చెల్లింపు ఛార్జీ: మీరు లోన్‌ను గడువుకు ముందే పూర్తిగా చెల్లించినా సరే మరో ఛార్జ్ ఉంటుంది. బ్యాంక్ ముందస్తు చెల్లింపు ఛార్జీని 2% నుంచి 5% వరకు ఉంటుంది.
లేట్ పేమెంట్ ఛార్జీ: EMI చెల్లింపును మిస్ అయితే కచ్చితంగా పెనాల్టీ కట్టాల్సిందే. లోన్ మొత్తంలో రూ.500 నుంచి 2% వరకు పెనాల్టీ తీసుకుంటారు.
ఇన్సూరెన్స్ ప్రీమియం: చాలా బ్యాంకులు లోన్ మాత్రమే ఇవ్వరు. దీనితో పాటు ఇన్సూరెన్స్ పాలసీని కలిపి ఇస్తాయి. దీనికి కూడా మీరు ప్రీమియం చెల్లించాలి. ఈ ఛార్జీ సాధారణంగా లోన్ మొత్తంలో కలిపి ఛార్జ్ చేస్తారు.
స్టాంప్ డ్యూటీ, డాక్యుమెంట్ ఛార్జీలు: లోన్ అగ్రిమెంట్ కోసం స్టాంప్ డ్యూటీ, డాక్యుమెంట్ ఛార్జీలు అని మరో ప్రాసెస్ ఉంటుంది. దీనికి మరింత అదనపు ఖర్చు.
మీరు లోన్ తీసుకుంటే వీటిల్లో కొన్ని ఛార్జీల గురించి ఏజెంట్లు, బ్యాంకులు అసలు చెప్పరు. సో మీరు ముందే అడిగితే కాస్త తగ్గుతుంది.
సీక్రెట్ ఛార్జీలు: మీ లోన్ అగ్రిమెంట్‌లో ఉన్న చిన్న అక్షరాలను కూడా చదివేయండి. సాధారణంగా ప్రాసెసింగ్ ఫీజు, GST వంటి కొన్ని ఛార్జీల గురించి తెలుసుకొని వీటిని తగ్గించుకోవచ్చు.
జాగ్రత్తలు : పర్సనల్ లోన్ ఎంత అడిగితే అంత ఇస్తున్నారు అని ఎక్కువగా తీసుకోవద్దు. తిరిగి సులభంగా చెల్లించగల మొత్తాన్ని తీసుకోవడం బెటర్. ఎక్కువ లోన్ తీసుకొంటే అప్పుల్లో కూరుకుపోవాల్సిందే అని గుర్తు పెట్టుకోండి. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వడ్డీ రేట్లు, ఛార్జీలు, రూల్స్ ని పోల్చి అప్పుడు మీరు ఒక క్లారిటీకి రావడం బెటర్.
తెలియని ఛార్జీలు:
లోన్ తీసుకునే ముందు, మీరు అన్ని ఛార్జీలు, నిబంధనల గురించి తెలుసుకోవడం మర్చిపోవద్దు. లోన్ అగ్రిమెంట్‌ను జాగ్రత్తగా చదివాలి. అర్థం కాని వాటి గురించి బ్యాంక్‌ను అడగడం అవసరం. పర్సనల్ లోన్‌ల వడ్డీ రేట్లు సాధారణంగా 10% నుంచి 24% వరకు ఉంటాయి. ఈ రేట్లు మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి కూడా ఛార్జ్ చేస్తారు. బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను ప్రకటిస్తాయి. కానీ ఇవి వ్యక్తిగత కారణాలతో మారుస్తుంటారు.
క్రెడిట్ స్కోర్: మీ CIBIL స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీరు తక్కువ వడ్డీ రేటుతో లోన్ తీసుకోవచ్చు. మీకు తక్కువ స్కోర్ ఉంటే ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. కొన్ని సార్లు దీని వల్ల లోన్ అప్లికేషన్ రిజక్ట్ అవుతుంది.
లోన్ కాలవ్యవధి: పర్సనల్ లోన్ టెన్యూర్ 1 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎక్కువ కాలం పెట్టుకుంటే తక్కువ EMI అమౌంట్ అవుతుంది. కానీ మీరు ఎక్కువ మొత్తం వడ్డీ చెల్లించాలి.
సెక్యూరిటీ లేని లోన్లు: పర్సనల్ లోన్లు సెక్యూరిటీ ఉండవు. అంటే మీరు పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ ఇది మాత్రం బ్యాంకులకు ప్రమాదకరం. అందుకే వారు ఎక్కువ వడ్డీ వసూలు చేస్తుంటారు. డౌట్ ఉంటే ఏజెంట్ల ద్వారా క్లియర్ చేసుకోండి.