Suzuki : స్కూటర్ సెగ్మెంట్‌లో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ హవా కొనసాగుతోంది. వాటికి పోటీగా అనేక కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పుడు భారతీయ మార్కెట్‌లో మరో రెండు కొత్త స్కూటర్లు రిలీజ్ అయ్యాయి. జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ సుజుకి రెండు స్కూటర్ల అప్‌డేట్ వెర్షన్‌లను విడుదల చేసింది. వాటిలో యాక్సెస్ మోడల్ ఇప్పటికే మార్కెట్‌లో ఉంది..ఇది నిజానికి యాక్టివా, జూపిటర్‌లకు పోటీని ఇస్తూనే ఉంది.
సుజుకి, సుజుకి అవెనిస్, సుజుకి బర్గ్‌మన్ సిరీస్ స్కూటర్ల అప్‌డేట్ వెర్షన్‌లను కూడా విడుదల చేసింది. కొత్త ఎమిషన్ స్టాండర్స్ ప్రకారం ఈ స్కూటర్లు OBD-2B కంప్లైంట్ ఇంజన్‌లతో విడుదలయ్యాయి. దీంతో కంపెనీకి చెందిన అన్ని స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల పోర్ట్‌ఫోలియో OBD-2B కంప్లైంట్ అయింది. సుజుకి పోర్ట్‌ఫోలియోలో V-స్టార్మ్, జిక్సర్ SF 250, జిక్సర్ 250, జిక్సర్ SF, జిక్సర్ వంటి 2-వీలర్స్ ఉన్నాయి.
సుజుకి కొత్త OBD-2B కంప్లైంట్ సుజుకి అవెనిస్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.93,200 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, దాని స్పెషల్ ఎడిషన్ ధర రూ.94,000 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్పెషల్ ఎడిషన్ మెటాలిక్ మాట్టే బ్లాక్, మాట్టే టైటానియం సిల్వర్ కలర్లో లభిస్తుంది. సాధారణ మోడల్‌లో 4 స్టాండర్డ్ కలర్స్ లో లభిస్తాయి. సుజుకి అవెనిస్ 125cc 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 8.5 bhp పవర్, 10 Nm పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.
Also Read : టెస్టింగ్ సమయంలో కెమెరా కంట పడ్డ మారుతి నయా మోడల్స్ ఇవే
దీంతో పాటు కంపెనీ సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ సిరీస్ స్కూటర్ల అప్ డేట్ వెర్షన్ ను రిలీజ్ చేసింది. ఇందులో బర్గ్‌మన్ స్ట్రీట్ ధర రూ. 95,800 నుంచి ప్రారంభమవుతుంది. బర్గ్‌మన్ స్ట్రీట్ EX మోడల్ రూ. 1.16 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. కంపెనీ బర్గ్‌మన్ స్ట్రీట్‌ను స్టాండర్డ్ ఎడిషన్ వేరియంట్, రైడ్ కనెక్ట్ వేరియంట్‌తో అందిస్తుంది. ఈ స్కూటర్‌లో కూడా సుజుకి అవెనిస్‌లో ఉన్న అదే ఇంజన్ లభిస్తుంది.
OBD-2B ఇంజన్ అంటే ఏమిటి?
దేశంలో ఎమిషన్ స్టాండర్స్ మారినప్పుడు BS-6 ప్రారంభించింది. BS-6 రెండవ దశను OBD-2B కంప్లైంట్ అంటారు. దీని పూర్తి రూపం ‘ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ వెర్షన్ 2B’. ఈ రకమైన ఇంజన్‌లో మీ వాహనం నుంచి రియల్-టైమ్‌లో ఉద్గారాలను పర్యవేక్షించే ఒక సిస్టమ్ మీ వాహనం లోపల అమర్చుతారు. అందులో ఏదైనా మార్పు ఉంటే అది మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. దీని ప్రయోజనం ఏమిటంటే ఇంజన్‌లో ఏదైనా సమస్యను ప్రారంభంలోనే గుర్తిస్తారు.
Also Read : కార్ల బుకింగ్స్ కు తత్కాల్ స్కీం.. 35ఏళ్ల క్రితమే దేశంలో అమలు.. దాని స్పెషాలిటీ ఏంటంటే ?