https://oktelugu.com/

CNG తో పాటు SUV.. ధర కూడా తక్కువే.. ఆ కార్లు ఏవో తెలుసా?

ఈ మధ్య ఎస్ యూవీ కార్ల మార్కెట్లోకి విపరీతంగా వస్తున్నాయి. కానీ ఇందులో పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్లను మాత్రమే చూశారు. కానీ ఎస్ యూవీ వేరియంట్ లో CNG ఉండే కార్ల గురించి కొంతమందికే తెలుసు. వీటిని రెండు కంపెనీలు ప్రవేశపెట్టాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : February 11, 2024 / 02:08 PM IST

    cng car with suv

    Follow us on

    CNG Car:  కార్ల కొనాలనుకునే వారు గతంలో లాగా కాంప్రమైజ్ కావడం లేదు. బాహుబలి లాంటి ఇంజిన్ తో పాటు విశాలమైన స్పేస్ ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఈ తరహా సౌకర్యాలు SUVలోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఎస్ యూవీ కార్ల కోసం ఎగబడుతున్నారు. ఈ మధ్య ఎస్ యూవీ కార్ల మార్కెట్లోకి విపరీతంగా వస్తున్నాయి. కానీ ఇందులో పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్లను మాత్రమే చూశారు. కానీ ఎస్ యూవీ వేరియంట్ లో CNG ఉండే కార్ల గురించి కొంతమందికే తెలుసు. వీటిని రెండు కంపెనీలు ప్రవేశపెట్టాయి. ఆ కార్ల గురించి తెలుసుకుందామా..

    మారుతి నుంచి ఇప్పటికే వివిధ మోడళ్లు మార్కెట్లోకి వచ్చి ఆకర్షించాయి. మారుతి కారు అనగానే ఏది కోరుకుంటే అది ఉంటుందనే భావన చాలా మందిలో ఉంది. ఉంది. ఈ నేపథ్యంలో CNG తో కలిపి SUV కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే బ్రెజ్జా. మారుతి బ్రెజ్జా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు ఇందులో CNG సౌకర్యం ఉంది. సీఎన్ జీ వెర్షన్ 25.52 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.9.24 నుంచి రూ.12.15 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

    మారుతికి పోటీగా టాటా దూసుకుపోతుంది. ఈ క్రమంలో టాటా కంపెనీ పంచ్ ను CNGలో తీసుకొచ్చింది. ఈ కారు 1.2 లీటర్ పెట్రోలఓ ఇంజిన్ తో పాటు CNG లో ఉంది. ఇది 77 బీహెచ్ పీ పవర్, 97 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 26.99 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. టాటా నుంచి పంచ్ మాత్రమే కాకుండా అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, ప్యూర్, అకాంప్లిష్డ్ అనే వేరియంట్లలో CNG సౌకర్యం ఉంది.

    వీటితో పాటు హ్యుందాయ్ సైతం CNG తో పాటు SUV కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కంపెనీకి చెందిన Exter CNG 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎన్ జీపై పై 69 బీహెచ్ పీ పవర్ 95 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని రూ.8.33 లక్షల నుంచి రూ.9.06 లక్షల వరకు విక్రయిస్తున్నారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగిన ఇది సీఎన్ జీలో 27.1 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.