SUV Electric Car : ప్రస్తుత కాలంలో కారు కొనాలని అనుకునేవారు ఎలక్ట్రిక్ కార్ల వైఫై మొగ్గుచూపుతున్నారు. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇవ్వడంతో పాటు.. కాలుష్యకారకంగా ఇవి ఉండడంతో చాలామంది వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో కంపెనీలు సైతం EV లను మార్కెట్లోకి తీసుకురావడానికి ఉత్సాహం చూపుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే చాలావరకు ఎలక్ట్రిక్ కార్లు భారత మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఇవి Sedan పరిధిలోనే ఉన్నాయి. ఇప్పుడు సరికొత్తగా SUV వేరియంట్లలో ఈవీ రాబోతుంది. దీనిని ఈ
సంవత్సరం Auto Expo లో ప్రదర్శించనున్నారు. మరి ఈ కారు ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వివరాల్లోకి వెళ్ళండి..
దక్షిణ కొరియా కంపెనీకి చెందిన Hyundai కార్ల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పటికే హ్యుందాయ్ నుంచి సెడాన్, హ్యాచ్ బ్యాక్, ఎస్ యు వి కార్లు మంచి ఆదరణ పొందాయి. అయితే ఇప్పుడు ఎస్ యు వి ఎలక్ట్రిక్ కారును ఈ కంపెనీ పరిచయం చేయబోతోంది. ఇప్పటికే ఉన్న హుందాయి క్రెటా మోడల్ ను SUV ఎలక్ట్రిక్ కారుగా మార్చారు. సాధారణంగానే కొందరు ప్రత్యేకంగా SUV కార్లను కోరుకుంటారు. అయితే ఇవి ఎలక్ట్రిక్ వేరియంట్ అయితే ఇంకా బాగుండు అని ఇప్పటివరకు అనుకున్నారు. వీరికి అనుగుణంగా Hyundai కంపెనీ కొత్తగా క్రెటా ఎస్ యు విని తీసుకురాబోతుంది..
Hyundai Creta SUV లో 17 అంగుళాల ఏరో డైనమిక్ అల్లాయి వీల్స్ ఉన్నాయి. ఇవి లో రెసిస్టెన్స్ టైర్లతో అమర్చబడి ఉంటాయి. కారు బ్యాక్ బంపర్ పై ఉన్న పిక్స్లేటెడ్ విభాగంలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇంటీరియర్ లో 10.25 డాష్ బోర్డు స్క్రీన్ లో ఉన్నాయి. ఇవి డ్రైవర్లకు కంఫర్టబుల్గా ఉంటాయి. వీటిలో ఒకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టం స్క్రీన్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ ప్లే కి సపోర్ట్ చేస్తుంది. మంచి సౌండ్ కోసం 8 స్పీకర్స్ ను అమర్చారు. 12 వి చార్జింగ్ పోర్టు, వైర్లెస్ చార్జర్ ఉన్నాయి.
సేఫ్టీ విషయంలో ఈ కారులో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇందులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఈబిడి తో కూడిన ఏబిఎస్.. ఆల్ వీల్ డిస్క్ బ్రేక్ , ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ లను ప్రత్యేకంగా అమర్చారు. అలాగే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం కూడా ఆకర్షిస్తుంది. మొత్తం 19 ఫీచర్లతో లెవెల్ టు అడాస్ సెటప్ లు కలిగిన ఈ కారులో స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.
హుందాయి క్రెటా టీవీలో 42 KWh, 51.4 KWh అనే రెండు బ్యాటరీలను అమర్చారు. మొదటి బ్యాటరీ పై 390 కిలోమీటర్ల మైలేజ్ ఉండగా.. రెండో బ్యాటరీ పై 473 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇవి 58 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు చార్జింగ్ అవుతుంది. అయితే ఈ కారు ధర విషయంలో ఎలాంటి సమాచారం అందలేదు. కానీ త్వరలోనే Auto Expo లో కారు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.