Sukanya Samriddhi Scheme: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.1000 పెట్టుబడితో రూ.4.24 లక్షలు!

Sukanya Samriddhi Scheme: పొదుపు పథకాలలో ఒకటైన సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో చేరడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చనే సంగతి తెలిసిందే. ఆడపిల్లల తల్లిదండ్రులకు ప్రయోజనం చేకూర్చడం కొరకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. 2015 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్ ను మొదలుపెట్టారు. అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో ఈ పథకం ఒకటి కాగా బాలిక పుట్టినప్పటి నుంచి పది సంవత్సరాలలో ఈ స్కీమ్ […]

Written By: Kusuma Aggunna, Updated On : August 27, 2021 7:11 pm
Follow us on

Sukanya Samriddhi Scheme: పొదుపు పథకాలలో ఒకటైన సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో చేరడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చనే సంగతి తెలిసిందే. ఆడపిల్లల తల్లిదండ్రులకు ప్రయోజనం చేకూర్చడం కొరకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. 2015 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్ ను మొదలుపెట్టారు. అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో ఈ పథకం ఒకటి కాగా బాలిక పుట్టినప్పటి నుంచి పది సంవత్సరాలలో ఈ స్కీమ్ లో చేరవచ్చు.

సుకన్య సమృద్ధి స్కీమ్ లో చేరాలంటే బాలిక ఖచ్చితంగా భారతీయురాలై ఉండటంతో పాటు కనీసం 250 రూపాయల నుంచి గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.6 శాతం వడ్డీరేటు అమలవుతోంది.

తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు కూతురి పేరుపై ఖాతాను తెరవవచ్చు. నెలకు కనీసం 1,000 రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 4.24 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఖాతాను మూసివేయాలని అనుకుంటే మాత్రం అవసరమైన అన్ని పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. పోస్టాఫీసులో లేదా బ్యాంకులలో సుకన్య సమృద్ధి ఖాతాను సులభంగా ఓపెన్ చేయవచ్చు.

కనీసం 250 రూపాయలు చెల్లించి ఖాతాను ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రతి నెలకు రూ.3 వేలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.15 లక్షలకు పైగా పోందే అవకాశం ఉంటుంది.