SbI: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా ఉన్న వినియోగదారులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఎస్బీఐ జన్ ధన్ ఖాతా కలిగి ఉన్న ఖాతాదారులకు 2 లక్షల రూపాయల వరకు ఉచితంగా బెనిఫిట్ కలగనుంది. ఎస్బీఐ జన్ ధన్ ఖాతా కలిగి ఉంటే ఫ్రీగానే ఈ బెనిఫిట్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2018 ఆగస్ట్ 28కు ముందు జన్ ధన్ ఖాతా తెరిస్తే మాత్రమే ఈ బెనిఫిట్ లభిస్తుంది.
పేదలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ జన్ ధన్ యోజన స్కీమ్ ను అమలులోకి తెచ్చింది. ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్లు జన్ ధన్ యోజన స్కీమ్ ద్వారా ఈ బెనిఫిట్ ను పొందడానికి అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. కేవైసీ వివరాలను అందజేయడం ద్వారా సులభంగా బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.
Also Read: The Kashmir Files: కాశ్మీర్ ఫైల్స్ కి న్యూజిలాండ్ లో ఆటంకాలు
జన్ ధన్ అకౌంట్ కలిగి ఉన్నవాళ్లకు ఫ్రీగా రూపే డెబిట్ కార్డు లభించనుందని సమాచారం అందుతోంది. అయితే రూపే డెబిట్ కార్డును వినియోగిస్తే మాత్రమే ఈ బెనిఫిట్ ను పొందడానికి అర్హత కలిగి ఉంటారు. కార్డు ద్వారా లావాదేవీ నిర్వహించడం లేదా ఏటీఎంకు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం ద్వారా ఈ బెనిఫిట్ ను పొందవచ్చు. ప్రమాదం జరగడానికి 90 రోజుల ముందు కనీసం ఒక్కసారైనా లావాదేవీ నిర్వహిస్తే ఈ బెనిఫిట్ పొందవచ్చు.
సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదిస్తే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎస్బీఐలో జన్ ధన్ ఖాతాను కలిగి ఉన్నవాళ్లకు ఈ విధంగా ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది.
Also Read: Chiranjeevi- Nani: ‘డాడీ’ గా మెగాస్టార్.. ‘బ్రో’ గా నాని.. కలయిక అదిరిపోయింది !