దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారులు మరింత భద్రంగా ఆన్ లైన్ లావాదేవీలు చేసే విధంగా కొత్త ఫీచర్ ను ఎస్బీఐ అందుబాటులోకి తెచ్చింది. రోజురోజుకు ఆన్ లైన్ మోసాలు దేశంలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. అందువల్ల ఎస్బీఐ ఈ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని రావడం గమనార్హం.
ఎస్బీఐ యోనో లైట్ ను ఉపయోగించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఎస్బీఐ ఈ కొత్త ఫీచర్ ను తీసుకురావడం గమనార్హం. ఎస్బీఐ యోనో లైట్ యాప్ కు సిమ్ బైండింగ్ ఫీచర్ ను జోడించగా గతంతో పోలిస్తే ఆన్ లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు ఇప్పుడు మరింత సురక్షితం అని ఎస్బీఐ వెల్లడించడం గమనార్హం. యోనో లైట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం వల్ల ఈ ఫీచర్ యొక్క బెనిఫిట్స్ ను పొందడం సాధ్యమవుతుంది.
సిమ్ బైండింగ్ ఫీచర్ వల్ల బ్యాంక్ కస్టమర్లు వారి మొబైల్ ఫోన్ లో యోనో లైట్ యాప్ ఉంటే మాత్రమే ఈ ఫీచర్ ను వినియోగించడం సాధ్యమవుతుంది. కేవలం ఒక డివైజ్ లో మాత్రమే ఈ యాప్ ను వినియోగించే అవకాశం ఉంటుంది. దేశంలో 40కోట్లకు పైగా కస్టమర్లు ఉన్న బ్యాంక్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పేరుంది. ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం.
సైబర్ మోసాల వల్ల ఖాతాదారులు భారీమొత్తంలో నష్టపోయే అవకాశాలు ఉండటంతో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆన్ లైన్ బ్యాంకింగ్ లావాదేవీలను సురక్షితం చేసే దిశగా ఎస్బీఐ అడుగులు వేయడంపై నెటిజన్లు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.