Star Health Premium : ప్రీమియం ను భారీగా పెంచిన స్టార్ హెల్త్.. ఇక అంత మేర కట్టాల్సిందే..

దేశంలో వ్యక్తి గత ఆరోగ్య పాలసీలు చేయడంలో స్టార్ హెల్త్ అన్నింటికంటే ముందుంది. అయితే తాజాగా ఆ సంస్థ తీసుకున్న నిర్ణయం మేరకు.. పాలసీలు మరింత ప్రియం కానున్నాయి.

Written By: NARESH, Updated On : August 16, 2024 1:28 pm

Star Health Premium Increase

Follow us on

Star Health Premium : స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తన పాలసీల్లో కొన్నింటి ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సుమారు 10 నుంచి 15 శాతం రేట్లు పెంచబోతున్నట్లు ప్రకటించింది. కొన్ని దవాఖానల్లో ఇప్పటి వరకు వర్తింపు కాని ఉత్పత్తులు, కొవిడ్ 19 సమయంలో తగ్గించినవి ఇందులో ఉన్నాయి. స్టార్ హెల్త్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో ఆనంద్ రాయ్, సీవోవో అమితాబ్ జైన్ మాట్లాడుతూ 30 శాతం పాలసీల ధరలు పెంచబోతున్నట్లు తెలిపారు. ఇందులో ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ మొత్తం ప్రీమియం సుమారు 4 శాతం పెరిగే అవకాశమున్నట్లు తెలిపారు. ఈ పెరుగుదల వినియోగదారులకు భారం కానున్నట్లు తెలుస్తున్నది. యాజమాన్యం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థ అందిస్తున్న పాలసీల ధరలు ఇకపై 10 నుంచి 15 శాతం మేర పెరుగుతాయని ప్రకటించింది. కొవిడ్ 19 తర్వాత హాస్పిటల్ చార్జీల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. అయితే నాటి నుంచి ఇఫ్పటి వరకు వీటిన సరిదిద్దలేదు.. వేచి ఉండే వ్యవధిని కూడా తగ్గించడం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం ముందుగా ఉన్న అనారోగ్య సమస్యలకు కూడా అధిక రేట్లు ఉన్నాయి. అయితే కొన్నింటి ధరలు మాత్రమే పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాం. వీటిలో ఒక పాలసీ ధర ఇప్పటికే పెంచాం.. మరొక దాని పెంపు నెలలో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కంపెనీ ఎండీ, సీఈవో ఆనంద్ రాయ్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఇందుకు తగ్గింపునకు సంబంధించి ఉన్న నియంత్రణలో మార్పులు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక మూడు, నాలుగేండ్లుగా వ్యాధుల చికిత్సలపై కూడా ఇవి ప్రభావం చూపనున్నాయని తెలిపారు.

ఇక కంపెనీ సీవోవో అమితాబ్ జైన్ మాట్లాడుతూ తమ సంస్థ సుమారు 30 శాతం పాలసీల ప్రీమియం పెంచబోతున్నట్లు తెలిపారు. సగటును ప్రీమియం రేట్లు 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రకటించారు. అయితే కొంత కాలంగా చికిత్సల్లో పెరుగుదల కనిపిస్తున్న నేపథ్యంలో ఫ్యామిలీ హెల్త్ ఆఫ్టిమా ప్లాన్ రేట్లలో పెరుగుదల కనిపిస్తుందని తెలిపారు.

రూ. 3 లక్షల పాలసీకి ప్రీమియం ఇంత..
ఉదాహరణకు చూసుకుంటే గతేడాది నరేందర్ రూ. 3 లక్షల పాలసీకి రూ. 36,262 ప్రీమియం ఇద్దరు కుటుంబ సభ్యులకు కట్టాడు అనుకుందాం. ఈ ఏడాది అదే పాలసీ యొక్క ప్రీమియం రూ. 80,078కి చేరింది. ఇందులో జీఎస్టీ నే రూ. 12 వేల వరకు ఉంది. అయితే ఈ పెరుగుదలతో వినియోగదారులపై భారం పెరుగుతుందని తెలిపాడు.

ముఖ్యంగా ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా ప్లాన్స్ తీసుకునే వారికి ఇది కష్టమేనని చెప్పారు. ఇంతలా పెంపును తాము ఊహించలేదని చెప్పుకొచ్చాడు. రానున్న రోజుల్లో వీటిపై తగ్గింపు ఉండకపోవచ్చని మరింత భారం మోపే అవకాశం లేకపోలేదని తెలుస్తున్నది. ఏది ఏమైనా ప్రస్తుతం దవాఖానాల్లో పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో ఈ పెంపు తప్పదని సంస్థ ప్రకటిస్తున్నది. కొవిడ్ 19 తర్వాత అన్ని దవాఖానల్లో చార్జీలు భారీగా పెరిగాయనడానికి ఇదొక ఉదాహరణగా కనిపిస్తున్నది. మరి ఈ ప్రీమియం రేట్ల పెంపును వినియోగదారులు ఎలా చూస్తారో చూడాలి.