Monkey pox Virus: ముంచుకొస్తున్న మంకీ పాక్స్‌.. 70 దేశాలకు పాకిన వైరస్‌.. 100 మంది మృతి!

కరోనా తొలగిపోయి.. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న ప్రపంచాన్ని మరోవైరస్‌ భయపెడుతోంది. ఆఫ్రికా దేశాల్లో పుట్టిన ఈ వైరస్‌.. క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 70 దేశాలకు పాకింది. వంద మందిని పొట్టన పెట్టుకుంది.

Written By: Raj Shekar, Updated On : August 16, 2024 1:39 pm

Monkey pox virus

Follow us on

Monkey pox Virus : చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌లో పుట్టిన కరోనా వైరస్‌.. దాదాప మూడేళ్లు ప్రపంచాన్ని వణికించింది. లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. వైరస్‌బారిన పడిన కోట్ల మంది చికిత్స తర్వాత కోలుకున్నారు. దాదాపు మూడు వేరియంట్లలో వైరస్‌ తీవ్రత చూపింది. తర్వాత ప్రభావం తగ్గింది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో కేసులు నమోదవుతుఆన్నయి. అయినా సాధారణ చికిత్సతో నయమవుతోంది. దీంతో ప్రపంచ దేశాలు కోవిడ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ దేశాలను మంకీ పాక్స్‌ భయపెడుతోంది. ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న మంకీ పాక్స్‌ క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో 70 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 100 మంది మృతిచెందినట్లు డబ్ల్యూహెచ్‌వో అధికారులు తెలిపారు. సుమారు 17 వేల అనుమానిత కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మంకీ పాక్స్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఎ గ్లోబల్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. గత రెండేళ్లలో డబ్ల్యూహెచ్‌ఓ ఇలా ప్రకటించడం ఇది రెండోసారి. కాంగోలో మంకీ పాక్స్‌ వైరల్‌ ఇన్ఫెక్షన్‌ విజృంభించడం సహా ఇతర చుట్టు పక్కల 12 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

1958లోనే గుర్తింపు..
మంకీ పాక్స్‌ను ఎంపాక్స్‌ అని కూడా అంటారు. 1958లో కోతులలో దీనిని తొలిసారి గుర్తించారు. ఇటీవలి మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో సోకిన జంతువులతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తులలో ఎంపాక్స్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. మంకీపాక్స్‌ బాధితుల్లో కూడా జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. దద్దుర్లు నొప్పిని కలుగజేస్తాయి. దక్షిణాఫ్రికాలో ఇప్పటికే అంతమైన మంకీపాక్స్‌ వ్యాధి.. స్వలింగ సంపర్గం వల్లే ఇతర దేశాలకు వ్యాపించి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. ఈ మంకీపాక్స్‌ గురించి ప్రపంచదేశాలకు దశాబ్దాలుగా తెలుసు. దీని విరుగుడుకు వ్యాక్సిన్‌ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. స్మాల్పాక్స్‌(మశూచి) వ్యాక్సిన్నే మంకీపాక్స్‌ బాధితులకు ఇస్తున్నారు. అది ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైంది. డెన్మార్కు చెందిన బవారియన్‌ నోర్డిక్‌ కంపెనీ మాత్రమే మంకీపాక్స్‌ నివారణకు వ్యాక్సిన్‌ తయారు చేస్తోంది.

వ్యాప్తి ఇలా..
ఇది ఇంతవరకు మంకీపాక్స్‌ లైంగిక సంపర్కం వల్ల వస్తుందని అనుకున్నారు. కానీ తర్వాత సన్నిహిత పరిచయం ఉన్నవాళ్ల నుంచి కూడా సక్రమిస్తున్నట్లు కొన్ని కేసుల ద్వారా తేలింది. అలా ఇప్పటి వరకు కాంగో నుంచి బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాతో సహా పొరుగ దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఈ నేపథ్యలోనే డబ్ల్యూహెచ్‌ హెచ్చరికలు జారీ చేయడమే గాక అంతర్జాతీయంగా ప్రజారోగ్య చర్యలను వేగవంతం చేయాలని కోరింది. అలాగే నిధులు సమకూర్చి వ్యాధిని అరికట్టేలా సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

హెల్త్‌ ఎమర్జెన్సీ..
మంకీ ఫ్యాక్స్‌ వేగంగ విస్తరిస్తుండడంతో కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ వ్యాప్తి విషయమై డబ్ల్యూహెచ్‌వో ఓ గ్లోబల్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించిది. ఈ వ్యాధి సాధారణ ఫ్లూ వంటి తేలికపాటి లక్షణాలలో మొదలవుతుంది. ఒక్కోసారి అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకంగా మారి శరీరంపై చీముతో నిండిన గాయాలను కలిగిస్తుంది. కాంగోలో ఈ వ్యాధి క్లాడ్‌ ఐతో ప్రారంభమై.. క్లాడ్‌ఐబీగా రూపాంతరం చెందినట్లు అధికారులు తెలిపారు. ఆఫ్రికా ఖండంలో ఇప్పటివరకు 17 వేల అనుమానిత మంకీపాక్స్‌ కేసులు, 517 మరణాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 160% కేసులు పెరిగాయని ఆఫ్రికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తెలిపింది.