https://oktelugu.com/

Devara Trailer : దేవర ట్రైలర్ కోసం రంగం సిద్ధం చేసిన కొరటాల…ఎప్పుడు వస్తుందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ, నట వరుసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ప్రతి సినిమాతో అతని అభిమానులను అలరించడమే కాకుండా ప్రతి పాత్ర తో ఏదో ఒక వైవిధ్యాన్నైతే ప్రదర్శిస్తూ ఆయన తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంటాడు...

Written By:
  • Gopi
  • , Updated On : August 16, 2024 / 01:21 PM IST

    Devara Trailer

    Follow us on

    Devara Trailer : మన స్టార్ హీరోల అభిమానులు సినిమాల కోసం ఈగర్ గా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ‘దేవర ‘ సినిమా కోసం అతని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడడమే కాకుండా ఈ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తే చూసి ఆనందపడాలని అనుకుంటున్నారు. మరి అందులో భాగంగానే ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లైతే వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా యూనిట్ కూడా ట్రైలర్ మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

    ఆగస్టు చివరి వారంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమా మీద అమాంతం అంచనాలను భారీ స్థాయిలో పెంచే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా వైడ్ గా వస్తున్న ఈ సినిమా మీద తెలుగులో మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే బాలీవుడ్ లో కూడా దీనిమీద మంచి అంచనాలను పెంచాలంటే మాత్రం ఇప్పుడు ప్రమోషన్స్ విపరీతంగా చేపట్టాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ కి మరొక 40 రోజులు మాత్రమే మిగిలి ఉండడం వల్ల ఇక ఇప్పటినుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటు సినిమా యూనిట్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక అందులో బాగంగానే ట్రైలర్ ని రిలీజ్ చేసి ఇక ఆ తర్వాత నుంచి సినిమా మేకర్స్ కూడా ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అందులో స్టైలిష్ క్యారెక్టర్ లో నటించిన ఎన్టీఆర్ ఈ సినిమాలో కూడా ఒక మాస్ పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో పాటుగా ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కి భారీ ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

    ఇక ఇంతకు ముందు టీజర్ లో రిలీజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ని మనం చూసినట్లయితే ఇది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ కూడా ఈ సినిమా కోసం తన పూర్తి ఎఫర్ట్ ని పెట్టి నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. తన క్యారెక్టర్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఈ ఒక్క సినిమాతో అటు గ్లామర్ పాత్రలో కానీ, ఇటు నటిగా కానీ మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…