Splendor Plus: స్పెండర్ ప్లస్ బైక్ అంటే ఇష్టడని వారుండరు. మూడు దశాబ్దాల పాటు వాహనదారులను ఆకట్టుకున్న పాత స్పెండర్ ప్లస్ ఇప్పటికీ కొందరి వద్ద ఉంది. మైలేజ్ తో పాటు మంచి ఇంజిన్ పవర్ ఉన్న ఈ మోడల్ ఆ తరువాత వివిధ రూపాల్లో అవతరించింది. కానీ ఇవి పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే తాజాగా హీరో కంపెనీ నుంచి స్పెండర్ ప్లస్ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చింది. దీని ధర కూడా మిగతా బైక్ ల కంటే తక్కువగా ఉండడంతో ఆకర్షితులవుతున్నారు. ఈ బైక్ వివరాల్లోకి వెళితే..
ఎక్కువ మైలేజ్ కోరుకునేవారికి స్పెండర్ ప్లస్ మంచి బైక్. ఇది ఇప్పుడు 2.0 మోడల్ లో మార్కట్లోకి రిలీజ్ అయింది. స్పెండర్ ప్లస్ ఎక్స్ టెక్ 2.0గా ఉన్న ఇది 100 సీసీ ఇంజిన్ తో పనిచేస్తుంది. 7.09 బీహెచ్ పీ పవర్ తో పాటు 8.05 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 4 గేర్లు ఉంటాయి. అయితే కొత్త స్పెండర్ లో టెలిస్కోపిక్ పార్కులు ఆకట్టుకుంటున్నాయి. అలాగే రెండు వైపులా డ్రమ్ బ్రేకులను అమర్చారు. ఇక బైక్ డ్యాష్ బోర్డు డిజిటల్ ఇనిస్ట్రుమెంట్ తో ఇచ్చారు. వై ఆకారంలో ఎల్ ఈడీ లైట్స్ అకర్షిస్తాయి.
ఒకప్పుటి స్పెండర్ కంటే కొత్త స్పెండర్ విపరీతంగా ఆకర్షిస్తోందని కొందరు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్ కంటే ఇది రూ.3000 తగ్గింపు ధరతో రూ.82.911 తో విక్రయిస్తున్నారు. ఇది హోండా కంపెనీకి చెందిన షైన్ కు గట్టి పోటీ ఇవ్వనుందని అంటున్నారు. ప్రస్తుతం షైన్ అత్యధిక అమ్మకాలు జరుపుకుంటోది. ఇక స్పెండర్ ప్లస్ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా విక్రయాలు జరుపుకుంటోంది. ఈ బైక్ లీటర్ పెట్రల్ కు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.