https://oktelugu.com/

Range Rover Cars: రేంజ్ రోవర్ కార్లను కలిగి ఉన్న సినీ సెలబ్రెటీలు వీళ్లే..

బాలీవుడ్ బాద్ షా ఇప్పుడు సినిమాల్ల తక్కువగా కనిపిస్తున్నా.. ఆయన నటిస్తున్న సినిమాలు దాదాపుగా సక్సెస్ గా నిలుస్తున్నాయి. షారుఖ్ ఖాన్ కు కారులో వెళ్లడం చాలా ఇష్టం. ఈ తరుణంలో ఆయన ల్యాండ్ రోవర్ కారును కలిగి ఉన్నాడు. ఇది 503 హార్స్ పవర్ తో ఉండి 700 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 2, 2024 / 01:00 PM IST

    range rover car Sonam Kapoor

    Follow us on

    Range Rover Cars: కారు కొనాలనుకోవడం కోరికైతే.. ఖరీదైన కారును కలిగి ఉండడం ఒక ఫ్యాషన్. కొంత మందికి కార్లు కొనడం హ్యాబిట్ గా మార్చుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా సెలబ్రెటీలు ఉంటారు. మార్కెట్లోకి ఖరీదైన కారు వచ్చిందంటే చాలు.. వెంటనే దానిని సొంతం చేసుకుంటారు.ఎక్కువ మంది సెలబ్రెటీలు లైక్ చేసే కారు ల్యాండ్ రోవర్ కారు. దీనిని కొందరు హీరో హీరోయిన్లు కొనుగోలు చేసి వాడుతున్నారు. వారు ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే వెంటనే చదివేయండి..

    బాలీవుడ్ లో కండల వీరుడిగా పేరు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ కు ఆల్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ ఉన్నారు. సల్మాన్ ఖాన్ కు కార్లు అంటే చాలా ఇష్టం. ఈయన ఎక్కువగా ఎస్ యూవీ కార్లను ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. బ్లూ రేంజ్ రోవర్ ను ఆయన రూ.4.4 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. ఇది హైబ్రిడ్ ఇంజిన్ ను కలిగి ఉంది.

    బాలీవుడ్ బాద్ షా ఇప్పుడు సినిమాల్ల తక్కువగా కనిపిస్తున్నా.. ఆయన నటిస్తున్న సినిమాలు దాదాపుగా సక్సెస్ గా నిలుస్తున్నాయి. షారుఖ్ ఖాన్ కు కారులో వెళ్లడం చాలా ఇష్టం. ఈ తరుణంలో ఆయన ల్యాండ్ రోవర్ కారును కలిగి ఉన్నాడు. ఇది 503 హార్స్ పవర్ తో ఉండి 700 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.4.4 కోట్లు

    ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కుమార్ కుమార్తె సోనమ్ కపూర్ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ భామకు కార్లు అంటే బాగా ఇష్టం. వీటిల్లో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ వీల్ బేస్ కారును కొనుగోలు చేసింది. ఎస్ యూవీ వేరియంట్ ను కలిగిన ఈ కారు రూ. 3.76 కోట్లు ఉంటుంది. ఇందులోనే సోనమ్ ఎక్కువగా ప్రయాణిస్తారు.

    బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఫేమస్ అయిన పూజా హెగ్డే కు కార్లంటే మోజు. మార్కెట్లోకి కొత్త కారు రాగానే దాని గురించి సెర్చ్ చేస్తారు. ఆమె కొనుగోలు చేసిన కార్లో ల్యాండ్ రోవర్ కారును ఎక్కువగా ఇష్టపడుతారు. ఎస్ యూవీ ఫార్మట్ లో ఉన్న దీనిని ఇటీవలే రూ.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు.

    బాలీవుడ్ లో ప్రజెంట్ బెస్ట్ కపుల్స్ గా కొనసాగుతున్నా ఆలియా భట్ రణబీర్ కపూర్ ఫ్యామిలీ సైతం రేంజ్ రోవర్ కార్లను కలిగి ఉన్నారు. దీని ధర రూ.3.76 కోట్లు . టర్బో చార్ఝ్ డ్ కలిగి న ఈ కారు డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది.