Splendor: భారతీయ కస్టమర్లలో టూ-వీలర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం 2025లో ఈ విభాగంలో జరిగిన అమ్మకాలను పరిశీలిస్తే, హీరో స్ప్లెండర్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ కాలంలో హీరో స్ప్లెండర్ మొత్తం 34,98,449 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన హీరో స్ప్లెండర్ అమ్మకాల్లో 6.23 శాతం పెరుగుదల కనిపించింది. ఈ అమ్మకాలతో హీరో స్ప్లెండర్ మార్కెట్ వాటా కూడా 26.05 శాతానికి చేరుకుంది. ఈ కాలంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 టూ-వీలర్ల అమ్మకాల గురించి వివరంగా తెలుసుకుందాం.
Also Read: హిట్ 3 మీద బజ్ మామూలుగా లేదుగా మొదటి రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుందంటే..?
అమ్మకాల జాబితాలో హోండా యాక్టివా రెండో స్టానంలో నిలిచింది. హోండా యాక్టివా ఈ కాలంలో 11.80 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 25,20,520 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. ఇక మూడో స్థానంలో హోండా షైన్ నిలిచింది. హోండా షైన్ ఈ కాలంలో 27.54 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 18,91,399 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది. నాలుగో స్థానంలో బజాజ్ పల్సర్ ఉంది. బజాజ్ పల్సర్ ఈ కాలంలో 6.04 శాతం వార్షిక క్షీణతతో మొత్తం 13,25,816 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది.
మరోవైపు అమ్మకాల జాబితాలో టీవీఎస్ జూపిటర్ ఐదో స్థానంలో నిలిచింది. టీవీఎస్ జూపిటర్ ఈ కాలంలో 31.06 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 11,07,285 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. ఆరో స్థానంలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది. హెచ్ఎఫ్ డీలక్స్ ఈ కాలంలో 6.10 శాతం వార్షిక క్షీణతతో మొత్తం 9,72,119 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది. ఏడో స్థానంలో సుజుకి యాక్సెస్ నిలిచింది. సుజుకి యాక్సెస్ ఈ కాలంలో 14.64 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 7,27,458 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది.
అమ్మకాల జాబితాలో టీవీఎస్ ఎక్స్‌ఎల్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. టీవీఎస్ ఎక్స్‌ఎల్ ఈ కాలంలో 4.15 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 5,01,813 యూనిట్ల టూ-వీలర్లను విక్రయించింది. తొమ్మిదో స్థానంలో టీవీఎస్ అపాచీ ఉంది. టీవీఎస్ అపాచీ ఈ కాలంలో 18.08 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 4,46,218 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది. ఇక పదో స్థానంలో బజాజ్ ప్లాటినా నిలిచింది. బజాజ్ ప్లాటినా ఈ కాలంలో 12.69 శాతం వార్షిక తగ్గుదలతో మొత్తం 4,38,740 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది.
Also Read: ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ వల్ల కెరియర్ పోగొట్టుకున్న స్టార్ హీరో