Skoda Kushaq price: ఒకప్పుడుకార్లను శ్రీమంతులు మాత్రమే కొనుగోలు చేసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కార్లను కొనుగోలు చేయడానికి చాలా మంది విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నారు. బ్యాంకులు కూడా రుణాలను మంజూరు చేస్తున్న నేపథ్యంలో కార్ల కొనుగోళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ధర విషయంలో కొనుగోలుదారులు పెద్దగా ఇబ్బందిపడటం లేదు. ఫీచర్ల విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. కొనుగోలు దారుల ఆసక్తిని మననం లో పెట్టుకుని కంపెనీలు కొత్తకొత్త మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అలా ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చిన మోడల్ పేరు స్కోడా కుషాక్.
స్కోడా కంపెనీకి ఇండియన్ మార్కెట్ లో సపరేట్ బేస్ ఉంది. తాజాగా ఈ కంపెనీ అప్ డెటేడ్ వెర్షన్ కుషాక్ ఫేస్ లిస్ట్ ను విడుదల చేసింది. ఈ మోడల్ ధర 10.69(ఢిల్లీ ఎక్స్ షోరూం) లక్షల నుంచి మొదలవుతుంది. ఇందులో అనేక రకాలైన అప్ గ్రేడ్ లు ఉన్నాయి. మిడ్ సైజ్ ఎస్ యూవీ డిజైన్ లో ఇది కనిపిస్తోంది. ఫీచర్లు, పవర్ ట్రెయిన్ వంటి విషయాలలో స్కోడా ఏమాత్రం రాజీపడలేదు.
Also Read: ఒక్క చార్జింగ్ తో రయ్యిన పరుగు.. ఇంకా ఎన్నో ఫీచర్లు.. ఈవీ కార్లలో ఇది బాహుబలి
కుషాక్ మోడల్ 1.0 టీఎస్1, 1.5టీెఎస్1 టర్బో పెట్రోల్ ఇంజన్ మోడల్స్ లో లభ్యమవుతోంది. ఈ మోడల్ హ్యుందాయ్ క్రెటా, ఫోక్స్ వ్యాగన్, మారుతీ, హోండా, కియా వంటి కంపెనీలకు గట్టిపోటీ ఇస్తోంది.
కుషాక్ ఫేస్ లిస్ట్ మోడల్ కు 5 స్టార్ గ్లోబల్ ఎన్ సీ ఏ పీ రేటింగ్ ఉంది. కుషాక్ అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగ్ లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ మౌంట్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
గతంలో ఈ మోడల్ లో 6 స్పీడ్ యూనిట్ ఉండేది. దానిస్థానంలో 1.0 లీటర్ టీెఎస్1 ఇంజన్ ఉంది. కొత్తగా 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది. ఇంజన్ కూడా 115 బీహెచ్ పీ పవర్, 178 ఎన్ ఎం టార్క్ ను సపోర్ట్ చేస్తుంది. పైగా 6 స్పీడ్ మాన్యువల్ ఆప్షన్ ఇందులో అందుబాటులో ఉంటుంది. 1.5 లీటర్ టీఎస్1 ఇంజన్ 147 బీహెచ్ పీ, 250 ఎన్ఎం టార్క్ ఈ మోడల్ ప్రత్యేకత. ఈ మోడల్ లో 7 స్పీడ్ డీఎస్జీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ యూనిట్ ఉంది. కొనుగోలు దారులకు మరింత మెరుగైన బ్రేకింగ్ అనుభవం అందించేందుకు వెనుక డిస్క్ బ్రేకులు ఏర్పాటు చేశారు.