SIP investment : మీరు చిన్న వయసు నుంచి పొదుపు చేయడం మొదలుపెడితే దీర్ఘకాలంలో పెద్ద రాబడిని పొందవచ్చు. ఒకవేళ మీ జీతం 25000 ఉన్నా కూడా మీరు అందులో 20 శాతం కంటే తక్కువ పొదుపు చేయడం ద్వారా కూడా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. మీకు వచ్చే నెలవారి జీవితంలో మీరు ఒక చిన్న మొత్తాన్ని ప్రతినెల తప్పకుండా పెట్టుబడి పెట్టడం వలన దీర్ఘకాలంలో మీరు భారీ నిధిని ఆశించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇది సాధ్యం అవుతుంది. సగటు జీతం పొందే ఉద్యోగం చేసే వారికి కోటి రూపాయల నిధిని ఆశించడం అసాధ్యమైన పని.
Also Read : ఎస్‌బీఐ కొత్త క్రెడిట్ కార్డు.. ఆరోగ్య సేవలకు ఆకర్షణీయ ఆఫర్లతో..
కానీ మీరు సరైన ప్రణాళిక అలాగే క్రమశిక్షణతో ప్రతి నెల వచ్చిన జీవితంలో కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లయితే ఇది తప్పకుండా సాధ్యమవుతుందని నిపుణులు చెప్తున్నారు. దీనికోసం మీరు సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. మీకు డేట్ సాధనాలతో పోల్చినట్లయితే ఈక్విటీ పెట్టుబడులు బాగా రాబడినీ ఇస్తాయి. వీటిలో కొంచెం రిస్క్ ఉన్నా కూడా దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టే వారికి మంచి లాభాలు వస్తాయి. గత చరిత్రను మీరు పరిశీలించినట్లయితే దీని గురించి మీకు స్పష్టంగా అర్థం అవుతుంది. మీరు దీర్ఘకాలంలో కోటి రూపాయల నిధిని సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. సిప్ విధానంలో మీరు ఒక నిర్ణీత మొత్తాన్ని కొంతకాలం పాటు ప్రతినెల డిపాజిట్. చిన్న మొత్తంలో కూడా మీరు ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో ఉన్న చక్రవడ్డీ ప్రభావంతో మీరు పెట్టిన పెట్టుబడులు మీకు అద్భుతమైన రాబడిని అందిస్తాయి.
మీకు వచ్చే నెల వారి జీవితంలో 15 నుంచి 20% మీరు పెట్టుబడికి కేటాయించాలి. క్రమం తప్పకుండా ఇలా చేసినట్లయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ప్రతి నెల 4000 చొప్పున పెట్టుబడి పెట్టినట్లయితే మీకు 12 శాతం రాబడిని అంచనా వేస్తే దాదాపు 28 సంవత్సరాల తర్వాత లేదా అంతకన్నా తక్కువ సమయంలోనే మీరు ఒక కోటి రూపాయలు నగదును సృష్టించుకోవచ్చు. మరొకటి తెలివైన ట్రిక్ ఏంటంటే ప్రతి ఏడాది కూడా సిప్ విధానంలో మీరు పెట్టే పెట్టుబడి నిర్దిష్టశాతం పెంచుకుంటూ పోవాలి. ప్రతి ఏడాది ఐదు శాతం మీరు పెట్టి పెట్టుబడి పెంచుకుంటూ వెళ్లినట్లయితే 301 నెలలోనే మీరు కోటి రూపాయలు అందుకోవచ్చు.