Motorola Razr Fold phone review: Motorola కంపెనీ నుంచి మొదటిసారిగా ఫోల్డబుల్ మొబైల్ రిలీజ్ అయింది. దీని నుంచి Razr Fold 2024లో జూలై 4 న మార్కెట్లోకి వచ్చింది. ప్రారంభంలో దీని 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 99,999 ఉండేది. ఆ తరువాత బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఉపయోగించుకుంటే రూ. 89,999కి లభించింది. అయితే ఈ ఫోన్ గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ మొబైల్ గురించి వినియోగదారులు ఏమంటున్నారు? ఫోల్డింగ్ ఫోన్ తో అనుభవం ఎలా ఉంటుంది? అనే వివరాల్లోకి వెళితె..
Motorola Razr Fold ప్రధాన ఆకర్షణ అద్భుతమైన డిస్ ప్లే. ఇందులో 2K రిలజ్యూషన్ తో 8.1-అంగుళాల LTPO POLED ఇన్నర్ డిస్‌ప్లే ఉంది. ఇది టాబ్లెట్ లాంటి అనుభూతిని ఇస్తుంది. బయటి వైపు 6.6 అంగుళాల కవర్ స్క్రీన్ ఉండనుంది. ఈ ఫోన్‌ను మడవకపోయినా ఒక సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ ఫోన్ సుమారు 6,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీనివల్ల ఎటువంటి వాతావరణంలోనైన స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ ఫోన్‌లో సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది గేమింగ్ ప్రియులకు, మల్టీ-టాస్కింగ్ చేసేవారికి బాగా ఉపయోగపడుతుంది. 16GB వరకు RAM ఉండటంతో యాప్స్ అన్నీ చాలా వేగంగా ఓపెన్ అవుతాయి. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో స్మార్ట్‌గా పనిచేస్తుంది.
ఫోటోగ్రఫీ ఎక్కువగా కోరుకునేవారికి ఈ కొత్త ఫోన్ వెరీ స్పెషల్ అనుకోవచ్చు. ఈ మొబైల్ వెనుక వైపు మూడు 50 మెగాపిక్సెల్ (50MP) కెమెరాలను అమర్చారు. ఇందులో ప్రైమరీ, అల్ట్రా-వైడ్ తో పాటు టెలీఫోటో లెన్స్‌లు ఉన్నాయి, ఇవి నాణ్యమైన ఫోటోలను, వీడియోలను అందిస్తాయి. సెల్ఫీల కోసం 32MP కెమెరా, మరో 20MP అండర్ డిస్‌ప్లే కెమెరా ఉండటం దీని ప్రత్యేకత.
సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది, కానీ Motorola Razr Fold లో 6,000mAh భారీ బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీకి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటోంది. ఇది కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. అలాగే 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
ఫోల్డబుల్ ఫోన్ల మన్నికపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ దీనికి IP48 లేదా 49 రేటింగ్ ఉండడంతో ధుమ్ము, ధూళి నుంచి రక్షణ ఇవ్వనుంది. అలాగే పటిష్టమైన గొరిల్లా గ్లాస్, వినూత్నమైన హింజ్ (Hinge) టెక్నాలజీ వల్ల ఫోన్ మడతపెట్టడం చాలా స్మూత్‌గా ఉంటుంది. ప్రీమియం లుక్, అద్భుతమైన డిస్‌ప్లే అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ ఉన్న ఫోన్ కావాలనుకుంటే Motorola Razr Fold ఒక అద్భుతమైన ఎంపిక.