Gold Prices: బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారికి ధరలు షాక్ ఇస్తున్నాయి. గత వారం రోజులుగా గోల్డ్ ప్రైస్ డౌన్ ఫాల్ లోనే ఉంటున్నాయి. వారం రోజుల్లో బుధవారం వరకు రూ.2,500 వరకు దిగింది. గురువారం కూడా రూ.10 తగ్గిందింది. ఈరోజు స్వల్పంగా తగ్గినా పెట్టుబడి పెట్టిన వారు మాత్రం నిరాశ చెందుతున్నారు. అయితే కొనుగోలు దారులు మాత్రం బంగారాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్టోబర్ 5న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం అక్టోబర్ 5న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.52,590గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములను రూ.57,370 కి దిగింది. అక్టోబర్ 4న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.52,590తో విక్రయించారు. బుధవారం కంటే గురువారం స్వల్పంగా తగ్గినా గోల్డ్ ప్రైస్ డౌన్ లో ఉండడం గమనార్హం. అయితే ఈ ధరలు ఇలాగే కొనసాగుతాయా? మళ్లీ అప్ మొదలవుతుందా? అనే దానిపై చర్చలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా కొనసాగింది. ఇక్కడ రూ.52,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.57,530గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.52,590 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.57,370 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.52,850 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.57,650తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.52,590 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.57,370తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,590తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.57,370తో విక్రయిస్తున్నారు.
వెండి ధరలు కూడా గురువారం పతనం కొనసాగాయి. ఈరోజు దాదాపు రూ.300 మేర తగ్గి ప్రస్తుతం కిలో వెండి రూ.70,700తో విక్రయిస్తున్నారు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.70,700గా నమోదైంది. చెన్నైలో రూ.73,100, బెంగుళూరులో 69,000, హైదరాబాద్ లో రూ.73,100తో విక్రయిస్తున్నారు. మిగతా నగరాలతో పోలిస్తే న్యూ ఢిల్లీలో వెండి ధరలు తక్కువగా నమోదయ్యాయి.