Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడంవల్ల అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజూ ప్రతి వ్యక్తికి ఏదో ఒక రూపంలో సహకారం ఉంటుంది. అలాంటి విషయాలను ఆస్ట్రాలజీ తెలుపుతుంది. ఈ శాస్త్రం ప్రకారం 2023 అక్టోబర్ 5న గురువారం 12 రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
బంధుమిత్రులతో కలిసి కొన్నికీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్తువులు సేకరిస్తారు. ప్రారంభించబోయే పనులను ఆపేయకుండా ముందుకు సాగించండి. అధికారుల నుంచి సహకారాలు తీసుకుంటారు. ఈ రాశివారు దుర్గాదేవి దర్శనం చేస్తే మంచిఫలితాలు ఉంటాయి.
వృషభం:
అనవసర ఖర్చలు విషయంలో జాగ్రత్తలు వహించాలి.నూతన వస్తువులను సేకరిస్తారు. కొత్తపనులు మొదలుపెట్టేటప్పుడు ఆటంకం ఎదురుకాకుండా చూసుకోవాలి.హనుమాన్ ఆరాధర చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి.
మిథునం:
కొన్ని సాహసోసేత నిర్ణయాలు విజయాలను చేకూరుస్తాయి. కొన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. విష్ణు దర్శనం చేస్తే కలిసివస్తుంది.
కర్కాటకం:
వ్యాపారం చేసే వారికి అనుకూలమైన రోజు. తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది.అయితే అనవసర విషయాల జోలికి వెళ్లకుడా ఉండాలి. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.
సింహం:
ప్రణాళికలు వేసి ముందుకు సాగాలి. కొన్ని నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. వృత్తిఉద్యోగాల వారికి ప్రతికూల ఫలితాలు ఉండే ఛాన్స్.ఈ రాశి వారు గోవింద నామాలు చదవడం వల్ల అనుకూల వాతావరణం ఉంటుంది.
కన్య:
కుటుంబ సభ్యలతో చర్చలు జరపడం వల్ల పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. బంధువుల సహకారం ఉంటుంది. శ్రీ లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి ఫలితాలు.
తుల:
సొంతనిర్ణయాలు లాభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. అయితే లక్ష్యంపై ఏకాగ్రతను కోల్పోకూడదు. దుర్గాదేవి పూజ చేయడంతో మంచి ఫలితాలు ఉంటాయి.
వృశ్చికం:
ఒత్తిడిని కలిగి ఉంటారు. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. గొప్పవారితో పరిచయాలు ఆనందాన్నిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సూర్య దేవ స్వామిని కొలిస్తే శుభ ఫలితాలు.
ధనస్సు:
పట్టుదలతో కలిగి ఉంటారు. ఇదే అనుకూలిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం చేసేవారు ఆచితూచి అడుగులు వేయాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. లక్ష్మీధ్యానం చేయడం వల్ల మనో ధైర్యం పెరుగుతుంది.
మకరం:
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభవార్త వింటారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. శివారాధన మరిన్ని ఫలితాలు ఇస్తుంది.
కుంభం:
కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అయినా ముందుకు సాగాలి. శ్రమ పెరుగుతుంది. సమాచారం లోపం లేకుండా చూసుకోవాలి. ఇతరులతో ఎక్కువగా వాదించడం వల్ల నష్టపోతారు. ఇష్టదైవాన్ని ప్రార్థించడం ద్వారా అనుకూల ఫలితాలు.
మీనం:
మనోదైర్యాన్ని కోల్పోకుండా ఉడాలి. తోటివారి సహకారం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారం చేసేవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించాలి.