సీనియార్ సిటిజన్లు పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అకౌంట్లలో లావాదేవీలు చేయడానికి మరో వ్యక్తికి అధికారం ఇవ్వడం కొరకు కొన్ని జాగ్రత్తలను కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మొదట ఖాతాదారుడు sb – 12 అనే ఫారమ్ ను పూరించాల్సి ఉంటుంది. పోస్టాఫీస్ శాఖ ద్వారా ఈ ఫారంను పొందే అవకాశం ఉంటుంది. విత్‌డ్రా, లోన్, క్లోజర్, ఇతర లావాదేవీలకు ఈ ఫారమ్ అనుమతిస్తుంది.
ఖాతాదారులు ఫారమ్ ను పూరించి నగదు ఉపసంహరణ కొరకు sb – 7. ఖాతా మూసివేయాలనుకుంటే sb – 7b ఫారంను నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాస్ బుక్, ఫారమ్ లతో పాటు కేవైసీ పత్రాలను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోస్టాఫీస్ ఉద్యోగులు తమ కంప్యూటర్ లో ఉన్న ఖాతాదారుల సంతకాల వివరాలతో సరిపోల్చుతారు. అది పర్యవేక్షకుడిచే ఆమోదించబడటంతో పాటు ఆ తర్వాతే చెల్లింపులు చేయబడతాయి.
పోస్టాఫీస్ పొదుపు ఖాతాలో డబ్బులను కేవలం నగదు రూపంలో మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అధీకృత వ్యక్తి పోస్ట్ ఆఫీస్ శాఖలో ఉద్యోగి లేదా ఏజెంట్‌గా ఉండరని గుర్తుంచుకోవాలి.